SL VS PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్లకు నేడు కీలక మ్యాచ్ జరుగనుంది. ముఖ్యంగా రెండు జట్లు కూడా సూపర్ 4లో తొలి మ్యాచ్ ఓటమి పాలయ్యాయి. బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమి చెందితే.. భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఇవాళ జరిగే పోరులో పాకిస్తాన్ తో శ్రీలంక తలపడనుంది. లీగ్ దశలో బంగ్లాదేశ్ పై అలవొకగా విజయం సాధించిన శ్రీలంక జట్టు.. సూపర్ 4లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం విధితమే.అయితే ఈ రెండు జట్లు కూడా పైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ జరిగే మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధించాలి. ఇవాళ విజయం సాధించిన జట్టుకు ఫైనల్ కి వెళ్లే అవకాశాలుంటాయి.
Also Read : IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!
వాస్తవానికి సూపర్ 4లో రెండు ఓటములు చెందితే ముందంజ వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతా జట్ల పై ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ జరిగే మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ రెండు జట్లకు కు కూడా పోరు కీలకం అనే చెప్పాలి. భారత్ చేతిలో ఓడినప్పటికీ మ్యాచ్ ప్రారంభంలో పాక్ బ్యాటింగ్ కాస్త మెరుగ్గానే కనిపించింది. టాప్ 3 బ్యాటర్లు ఫఖర్ జమాన్, ఫర్హాన్, అయూబ్ రాణించారు. అయితే జట్టు మిడిల్ ఆర్డర్ కాస్త పేలవంగా కనిపిస్తోంది. కెప్టెన్ సల్మాన్, తలత్, నవాజ్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. మరోవైపు శ్రీలంక కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లనే బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. లీగ్ లో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శను బట్టి చూస్తే.. ఆ జట్టు కోలుకునే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిసాంక పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే బౌలింగ్ చమీరా, హసలంక అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు ఆల్ రౌండర్ శనక బంగ్లా పై కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం విధితమే. ఇక ఇప్పటి వరకు ఆకట్టుకోని కెప్టెన్ అసలంక ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటుంది. ఒకవేళ ఇవాళ శ్రీలంక విజయం సాధించినట్టయితే.. రేసులో బంగ్లాదేశ్ కూడా ఫైనల్ వెళ్లే అవకాశాలుంటాయి. ఎందుకంటే..? పైనల్ కి వెళ్లాలంటే.. శ్రీలంక జట్టు భారత్ తో ఈనెల 26న తలపడనుంది. దీంతో భారత్ చేతిలో గెలవడం శ్రీలంక కి అంత ఈజీ కాదు. కాబట్టి బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో గెలవకపోయినప్పటికీ.. రన్ రేట్ కాస్త మెరుగుపరుచుకుంటే బంగ్లాదేశ్ టీమిండియా తలపడే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఇవాళ శ్రీలంక విజయం సాధిస్తే.. టీమిండియా పై కూడా కచ్చితంగా విజయం సాధిస్తేనే ఫైనల్ కి చేరుకుంటుంది. ఇవాళ జరిగే శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.