Weather News: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కుండపోత వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో వాన పడింది. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. మొన్న ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడింది.
ఈ నెల 27 వరకు భారీ వర్షాలు
తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వివరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పింది.
ALSO READ: AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు
భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
మరి కాసేపట్లో నార్త్, వెస్ట్, సెంట్రల్ హైదరాబాద్ ప్రాంత ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, షేక్ పేట, ఖైరతాబాద్, టోలీ చౌకీ, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడి వర్షం పడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర వాసులు బయటకు రావొద్దని చెబుతున్నారు. అలాగే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
కాపేపట్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..
మరో గంట సేపట్లో కొమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగామ, యాదాద్రి- భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ భారీ ఉరుములతో కూడిన పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.