HMWSSB: హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలకు 24 గంటల పాటు అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తెలిపింది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ వివరాల ప్రకారం.. మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో పలు చోట్ల లీకేజీలు ఏర్పడడంతో బుధవారం నీటి అంతరాయం ఏర్పడనుంది. లీకేజీలు ఏర్పడడంతో రిపేరు పనులు అవసరమని అధికారులు తెలిపారు.. ఈ రిపేరు పనులు బుధవారం (సెప్టెంబర్ 24) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 25) ఉదయం 6 గంటల వరకు జరుగనున్నాయని చెప్పారు. ఈ 24 గంటల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు వివరించారు.
లీకేజీలు ఉన్న చోట రిపేరు పనులు కలబూర్ నుంచి హైదర్ నగర్ వరకు విస్తరించి ఉన్న పలు ప్రాంతాల్లో 1,500 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పీఎస్సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌పై జరుగనున్నాయి. ఈ పైప్‌లైన్‌లో అధికారులు చాలా చోట్ల లీకేజీలు గుర్తించారు. దీని కారణంగా నీటి సరఫరాపై ప్రభావం పడనుంది. ఈ రిపేరు పనులు చేయడం వల్ల నీటి వృథాను నివారించవచ్చు. భాగ్యనగరంలో నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైనవి.
ఈ రిపేరు పనుల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు..
O&M డివిజన్ 17: ఆర్‌సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, మదీనాగూడ, మియాపూర్
O&M డివిజన్ 22: బీరంగూడ, అమీన్‌పూర్
ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2: ఆఫ్-టేక్ పాయింట్లు మరియు బల్క్ కనెక్షన్లు
O&M డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్
O&M డివిజన్ 9: కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు నీటి సరఫరాలో అంతరాయాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి వారు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని అధికారులు సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఈ సమయంలో ఇబ్బందులను తగ్గించవచ్చని HMWSSB తెలిపింది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవడం లేదా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.
ALSO READ: AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు
ఈ రిపేరు పనులు నీటి సరఫరా వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి.. అలాగే భవిష్యత్తులో లీకేజీల వల్ల కలిగే సమస్యలను నివారించడానికి చేబడుతున్నారు. HMWSSB ప్రజల సహకారాన్ని కోరుతూ.. ఈ అసౌకర్యాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ALSO READ: IBPS Recruitment: బిగ్ గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు