OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ సిరీస్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో తియాషా అనే టీనేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, నిషాన్ అనే వివాహితుడైన టీచర్‌పై మోజులో పడుతుంది. ఇక అక్కడినుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సిరీస్ బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగే ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బసంత ఎసే గెచే’ (Basanta Eshe Geche) 2024లో విడుదలైన బెంగాలీ సైకలాజికల్ వెబ్ సిరీస్. అభిమన్యు ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో స్వస్తికా దత్తా, అర్పన్ ఘోషల్, సాక్షి సాహా, దీపాన్వితా నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సురిందర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్, ప్రేమలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల కథను చూపిస్తుంది. ఇది 2024 మే 24 నుంచి అడ్డాటైమ్స్‌లో, 6 ఎపిసోడ్‌లతో స్ట్రీమ్ అవుతోంది. బిలిబిలి టీవీలో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ IMDbలో 7.5/10 రేటింగ్ ని కూడా పొందింది.
ఈ సిరీస్ తియాషా అనే ఒక 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినితో ప్రారంభమవుతుంది. ఆమె తన మ్యాథ్స్ కోచింగ్ ట్యూటర్ నిషాన్ తో గాఢంగా ప్రేమలో పడుతుంది. అతను ఆమె కంటే చాలా పెద్దవాడు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వ్యక్తి. నిషాన్ తన భార్య చంద్రిమాతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతను తన భార్యను గాఢంగా ప్రేమిస్తుంటాడు. అయితే తియాషా ఒక లవ్ లెటర్ ను నిషాన్‌కు పంపడంతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి. ఈ లేఖ వారి సంతోషమైన వివాహ జీవితాన్ని పేక మేడల్లా కూల్చివేస్తుంది. ఆ లెటర్ ను చంద్రిమా చూడటంతో అసలు సమస్య మొదలవుతుంది. తియాషా ప్రేమ లేఖ నిషాన్‌ను గందరగోళానికి గురి చేస్తుంది, అదే సమయంలో తన భార్య చంద్రిమాతో తన సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు.
మరోవైపు చంద్రిమా ఒక గృహిణిగా, తన భర్త ప్రవర్తనలో మార్పును గమనిస్తుంది. ఇది ఆమెలో అభద్రతాభావాన్ని పెంచుతుంది. తియాషా, నిషాన్‌ను ఆకర్షించడానికి ధైర్యంగా అడుగులు వేస్తుంది. కానీ ఆమె చర్యలు అనుకోని పరిణామాలకు దారితీస్తాయి. నిషాన్ ఒక నీతిమంతమైన వ్యక్తిగా, తన విద్యార్థి ప్రేమను గౌరవంగా తిరస్కరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని గందరగోళం, చంద్రిమాతో అతని సంబంధం ఒత్తిడిలో పడుతుంది. ఈ సమయంలో చంద్రిమా తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. క్లైమాక్స్ లో ఈకథ ఊహించని మలుపు తీసుకుంటుంది. తియాషాని నిషాన్ ప్రేమిస్తాడా ? నిషాన్ నుంచి చంద్రిమా విడిపోతుందా ? ఈ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సీరిస్ ను మిస్ కాకుండా చుడండి.
Read Also : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ