YS Jagan: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్లనున్నారా..? ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడనున్నారా..? ఇంటిపోరుతో పాటు పార్టీ నేతలను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లనున్నారా..? వైఎస్ జగన్‌కు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది…? ఆయన వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలేంటి..? ఇంతకీ జ్యోతిష్య పండితులు ఏం చెప్తున్నారు..? ఈ కథనంలో తెలుసుకుందాం.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక నేత. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జగన్.. రాష్ట్ర విభజనకు ముందే సొంత కుంపటి పెట్టుకుని 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ అధికారంలోకి రాకున్నా.. 2019 ఎన్నికల్లో మాత్రం అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచి ఏపీ రాజకీయాలను అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో శాసించారు జగన్. అయితే 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్సార్ సీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొంది. కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో అధికారానికి దూరమైన జగన్ పార్టీని కాపాడుకోవడంపై కూడా పెద్దగా ఫోకస్ చేసినట్టు లేడు. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన మరుక్షణమే సొంత పార్టీ నాయకులే జగన్ నిరంకుశత్వాన్ని విమర్శించారు. ఎమ్మెల్యేలకు సమస్యలు చెప్పుకునే టైం ఇవ్వలేదని మీడియా, సోషల్ మీడియా సాక్షిగా ఆ పార్టీ నేతలు వాపోయారు.
అధికారం చేజారిన వైఎస్సార్‌సీపీ అసంతృప్త నేతలు కూడా ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోవడం మొదలైంది. ముఖ్య నాయకులు కొంత మంది పార్టీకి దూరం కావడం.. జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారితే.. మరికొంత మంది నాయకులు పక్కదారులు చూసుకోవడం.. ఇంకొంత మంది నాయకులు కేసుల్లో ఇరుక్కుని జైళ్లకు వెళ్లడం వైఎస్ జగన్‌కు కోలుకోని దెబ్బలుగా మారిపోతున్నాయి. జగన్‌కు రాష్ట్రలో పార్టీని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పిడిందని రాజకీయ మేధావులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి కంటిన్యూగా కొనసాగితే వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా పుంజుకోవడం పక్కన పెడితే అసలు రాజకీయ అస్థిత్వానైనా నిలుపుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైఎస్ జగన్ కు వ్యక్తిగతంగా కూడా ఈ సంవత్సరం అసలేం బాగాలేదని జ్యోతిష్య పండితులు షాక్ ఇచ్చారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశిలో పుట్టిన జగన్ వ్యక్తిగత జాతకంలో దేవగురు బృహస్పతి బలంగా లేడని దీంతో జగన్ జాతకంలో ఎటువంటి బలం లేదని.. అందువల్లే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయిందని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదని చెప్తున్నారు. ఇక జాతకం ప్రకారం న్యాయపరమైన చిక్కుల్లో జగన్ పడతారని.. గతంలో ఉన్న కేసులన్నీ విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పండితులు. ఆ కేసుల్లో కోర్టు తీర్పులు కూడా జగన్‌కు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో జగన్ జాతకంలో సానుకూలమైన ఫలితాల కంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక జగన్‌కు ఇంటి పోరు అధికం కానుందని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్‌కు ప్రతికూలంగా మారనుందని చెప్తున్నారు. ఇక సొంత పార్టీకి చెందిన నేతలను కూడా కాపాడుకోలేని పరిస్థితులు కొంతకాలం కొనసాగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?