E-Paper
Advertisement

JOBS: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.68,000 జీతం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే ఛాన్స్..

JOBS: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.68,000 జీతం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే ఛాన్స్..
Advertisement

NPCIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఇంటర్, జీఎన్ఎం, బీఎస్సీ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి సమాచారం సవివరంగా చూద్దాం.

కైగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)లో 391 సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య: 391

న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

సైంటిఫిక్ అసిస్టెంట్ బీ, స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్), అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ అండ్ ఏ), అసిస్టెంట్ గ్రేడ్-1 (సీఅండ్ ఎంఎం), నర్స్, టెక్నీషియన్/ సీ (ఎక్స్- రే టెక్నీషియన్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..

సైంటిపిక్ అసిస్టెంట్ బీ: 45 పోస్టులు
స్టైఫండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్: 82 పోస్టులు
స్టైఫండర్ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్టీ/ టెక్నీషియన్) : 226 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ అండ్ ఏ): 4 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (సీ అండ్ ఎమ్ఎమ్): 10
నర్స్- ఏ: 1 పోస్టు
టెక్నీషియన్ /సీ (ఎక్స్- రే టెక్నీషియన్): 1 పోస్టు

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 12

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 1

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్, ఇంటర్, జీఎన్ఎం, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, బీఎస్సీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ అసిస్టెంట్, ఎస్టీ/ఎస్ఏ, నర్స పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

మిగితా పోస్టులకు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.39,000 నుంచి రూ.68,000 వరకు వేతనం ఉండనుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://npcil.nic.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 391

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 1

ALSO READ: JOBS: డిగ్రీ క్వాలిఫికేషన్‌తో సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే భయ్యా..

ALSO READ: Jobs: ఏపీలో ఉద్యోగాలు.. లక్షకు పైగా వేతనం.. దరఖాస్తుకు ఇంకా 3రోజులే..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×