E-Paper
Advertisement

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!
Advertisement

Best Budget Earbuds: ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఎంత కామనో.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా అంతే కామన్ అయిపోయాయి. ఫోన్ కొనగానే మంచి సౌండ్ క్వాలిటీతో, ఎక్కువ ఫీచర్లు ఉన్న బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కోసం చాలామంది చూస్తున్నారు. అయితే బడ్జెట్‌లోనే మంచి సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు కావాలనేది అందరి కోరిక. ఇదే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ బ్రాండ్లు కూడా తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మరి త్వరలో అందుబాటులోకి రానున్న ఆ మోడళ్లు ఏంటి? వాటిలో ఉండే ఫీచర్లు, ధరలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దామా.

బోట్ నుంచి సరికొత్త ఫీచర్లు:

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి బోట్ ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. త్వరలో రాబోయే కొత్త మోడళ్లలో బ్యాటరీ లైఫ్ మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే బలమైన బేస్, కాల్స్ క్లియర్‌గా వినిపించేందుకు మెరుగైన మైక్, గేమింగ్ ఆడేవారి కోసం లో-లేటెన్సీ మోడ్ వంటివి తీసుకురానున్నారు. తక్కువ ఖర్చుతో రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా ఉండే ఇయర్ బడ్స్ కోరుకునేవారికి ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.

యూత్ టార్గెట్‌గా నాయిస్ ల్యాంచెస్:

Advertisement

యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న బ్రాండ్లలో నాయిస్ ముందుంటుంది. సరికొత్త డిజైన్లు, ట్రెండీ లుక్‌తో ఇయర్ బడ్స్ తయారు చేయడంలో ఈ కంపెనీ స్పెషలిస్ట్. రాబోయే కొత్త లాంచ్‌లలో సౌండ్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్, ఈజీ టచ్ కంట్రోల్స్‌తో పాటు తక్కువ ధరకే ప్రాక్టికల్ ఫీచర్లు అందించడమే టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది.

Also Read: 48MP కెమెరా, A19 చిప్‌ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!

స్మార్ట్ కనెక్టివిటీతో రియల్‌మీ:

Advertisement

మార్కెట్లో రియల్‌మీ బ్రాండ్ కూడా పోటీలో గట్టిగానే ఉంది. మోడ్రన్ డిజైన్‌తో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఖరీదైన ఫీచర్లను కూడా తక్కువ బడ్జెట్‌లో అందించే ప్రయత్నం చేస్తోంది. రియల్‌మీ ఫోన్ వాడేవారికైతే ఈ ఇయర్ బడ్స్ మరింత ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఒకే బ్రాండ్ ఎకోసిస్టమ్ ఇష్టపడేవారికి ఈ కొత్త మోడల్స్ మంచి అనుభూతిని ఇస్తాయి.

వన్‌ప్లస్ నుంచి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు:

ధర కాస్త అటుఇటుగా ఉన్నా ప్రీమియం లుక్, బెస్ట్ సౌండ్ కోరుకునేవారికి వన్‌ప్లస్ మంచి ఆప్షన్. త్వరలో రాబోయే బడ్జెట్ ఇయర్ బడ్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్, క్లియర్ కాలింగ్, మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు ఉండొచ్చు. సాధారణ వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల నుంచి కాస్త అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకునేవారికి ఈ బ్రాండ్ కొత్త మోడల్స్ చక్కగా సరిపోతాయి.

పోటీని తట్టుకునేలా బౌల్ట్ ఆడియో:

యువతలో మంచి ఆదరణ ఉన్న బౌల్ట్ ఆడియో బడ్జెట్ సెగ్మెంట్‌లో వరుసగా కొత్త ప్రొడక్ట్స్ ఇస్తోంది. స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బాస్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ కొత్త మోడల్స్ రాబోతున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో బడ్జెట్ ఇయర్ బడ్స్ మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. మీ బడ్జెట్‌కు తగినట్లు ఏ బ్రాండ్ ఇయర్ బడ్స్ కొనుక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి.

Also Read: స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×