E-Paper
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!
Advertisement

Pebble Qore 2 Fitness Band: రోజు రోజుకూ మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. వాకింగ్, రన్నింగ్, జిమ్ వర్కౌట్లు చేస్తూ మన ఫిట్‌ నెస్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి స్మార్ట్ బ్యాండ్‌లు బాగా ఉపయోగ పడుతున్నాయి. మార్కెట్లో.. రకరకాల బ్రాండ్లు ఉన్నప్పటికీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ , అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ కోరుకునే వారి కోసం పెబుల్ కంపెనీ తీసుకొచ్చిన ‘Pebble Qore 2’ ఫిట్‌నెస్ బ్యాండ్ ఇప్పుడు యూత్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. కేవలం రూ.3,549 ధరలో లభిస్తున్న ఈ బ్యాండ్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

45 రోజుల  బ్యాటరీ బ్యాకప్:

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ అతి పెద్ద హైలైట్ దీని బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. సాధారణంగా స్మార్ట్‌ వాచ్‌లు లేదా బ్యాండ్‌లను ప్రతి రోజో లేదా రెండు రోజు కోసారి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఈ పెబుల్ కోర్ 2 బ్యాండ్ ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 45 రోజుల పాటు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. రోజూ ఛార్జింగ్ కేబుల్స్ పట్టుకుని తిరిగే.. టెన్షన్ లేకుండా ప్రయాణాలు చేసే వారికి ఇది నిజంగా ఒక గొప్ప వరం లాంటిది.

అడ్వాన్స్‌డ్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

ధర తక్కువగా ఉన్నప్పటికీ హెల్త్ ఫీచర్ల విషయంలో.. ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో.. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్ , స్లీప్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. మీ నిద్ర విధానాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని ఇది నిరంతరం ఖచ్చితంగా మానిటర్ చేస్తుంది. అలాగే.. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల మీరు చేసే వర్కౌట్లు, రన్నింగ్ వంటి వాటికి సంబంధించిన క్యాలరీ బర్న్ డేటాను ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు.

స్టైలిష్ డిజైన్,డిస్‌ప్లే:

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ చూడటానికి చాలా స్లీక్‌గా, మోడర్న్ లుక్‌లో ఉంటుంది. చేతికి.. పెట్టుకున్నప్పుడు చాలా లైట్‌ వెయిట్‌గా అనిపిస్తుంది. దీని బ్రైట్ డిస్‌ప్లే ఎండలో.. కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ రకాల కస్టమైజ్డ్ వాచ్ ఫేస్‌లతో దీన్ని మన మూడ్‌కి తగినట్లుగా మార్చుకోవచ్చు. దీనిలో వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Advertisement

Also Read: పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

స్మార్ట్ నోటిఫికేషన్స్, కనెక్టివిటీ:

ఫోన్ చేతిలో లేకపోయినా, వాట్సాప్ మెసేజ్‌లు, కాల్ అలర్ట్‌లు , సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు అన్నీ మీ చేతిలోని.. ఈ బ్యాండ్‌కే వస్తాయి. దీని వల్ల ఇంపార్టెంట్ కాల్స్ లేదా మెసేజ్‌లను మిస్ అయ్యే.. చాన్సే ఉండదు. స్మార్ట్‌ ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా ఇది చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది.

మొత్తంగా చూస్తే.. రూ. 3,549 బడ్జెట్‌లో అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు , సుదీర్ఘమైన 45 రోజుల బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ‘Pebble Qore 2’ ఫిట్‌నెస్ బ్యాండ్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ధరలో ఎక్కువ కాలం పని చేసే నమ్మకమైన గాడ్జెట్ కావాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా కొనొచ్చు.

Related News

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×