BigTV English

Sharmila : K-కన్నీళ్లు C-చావులు R-రోదనలు.. షర్మిల కౌంటర్..

Sharmila : K-కన్నీళ్లు C-చావులు R-రోదనలు.. షర్మిల కౌంటర్..

Sharmila : KCR అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అనే పదంలో K అంటే కన్నీళ్లు, C అంటే చావులు, R అంటే “రోదనలు అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీకి ఎగనామం, ఉచిత ఎరువులకు పంగనామం పెట్టారని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.


సబ్సిడీ విత్తనాలకు కుచ్చుటోపీ పెట్టిండు, గాలి మోటార్లో తిరిగి.. గాలి మాటలు చెప్పి నష్టపరిహారం ఎగ్గొట్టిండని కేసీఆర్‌ పాలనపై షర్మిల ధ్వజమెత్తారు. దొర పాలనలో రైతులు అప్పులపాలై ఉరికంభం ఎక్కుతున్నారని ఆమె ఆరోపించారు.

కల్లాలపైనే గుండెలు ఆగిపోతున్నా, పురుగుల మందు తాగి నురుగలు కక్కి చచ్చిపోతున్నా.. ఇక్కడి దొరకు పంజాబ్, హర్యానా రైతులే కనబడుతారని ఫైర్ అయ్యారు. భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిది అని ట్వీట్ చేసారు షర్మిల.


Tags

Related News

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

HC Banned Beef: కావాలంటే ముందు రోజు కొనుక్కో.. బీఫ్ లవర్స్‌కు హైకోర్టు మొట్టికాయలు

TG Heavy Rains: తెలంగాణ ఐదు రోజులు భారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad building: బేగంబజార్‌లో కూలిన పాత భవనం.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Peddamma Temple: పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Musi River: మూసీ వరదలో చిక్కుకున్న యువకుడు.. రెస్క్యూ టీమ్ వచ్చే లోపే..

Big Stories

×