
Manchu Family:మొన్న మొన్నటిదాకా పవన్ కల్యాణ్‌కీ, అల్లు అర్జున్‌కి పడటం లేదా? అనే మాటలు వినిపించాయి. ఆ తర్వాత అల్లు ఫ్యామిలీలో అలకలు మొదలయ్యాయట. అన్నదమ్ములకు పొసగడం లేదట, అందుకే అల్లు అరవింద్ ఆస్తుల పంపకం పెట్టేశారట,తన తర్వాత తన వ్యాపారాలను తనయులు చూసుకుంటారని ప్రకటించారనే మాటలూ వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య చెడిందనే మాటలు వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు వెరోనికాను పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్, స్కూల్స్ అంటూ బిజీగా ఉన్నారు మంచు విష్ణు.
పెళ్లి చేసుకున్న అమ్మాయి నుంచి విడిపోయి, హీల్ కావడానికి టైమ్ తీసుకున్నారు మంచు విష్ణు. మోహన్‌బాబు ఆల్రెడీ పిల్లలకు ఆస్తి పంపకాలు చేసేశారనే మాటలూ ఉన్నాయి. ఆ పంపకాల్లోనే ఫిల్మ్ నగర్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎవరికి వారు సెటిల్ అయినా, ఇంకా పక్కాగా సెటిల్ కానిది మంచు మనోజే అనే మాటలూ ఉన్నాయి. ప్రస్తుతం అహం బ్రహ్మస్మి అనే సినిమా చేస్తున్నారు మంచు మనోజ్. త్వరలోనే భూమా మౌనికను వివాహం చేసుకుంటారనే మాటలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తానూ, మనోజ్ తరచూ కలుస్తుంటామని, విష్ణు ఫోకస్ ఎప్పుడూ పిల్లలు,బిజినెస్‌ల మీద ఉంటుందని, అందుకని అతను తరచూ కలవడని అన్నారు లక్ష్మి. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి కనిపిస్తామని, ఎప్పటికప్పుడు అందరితో కలిసి కనిపించి మెప్పు పొందాల్సిన అవసరం లేదని అన్నారు. పనీపాటా లేకుండా తమ గురించి కామెంట్ చేసే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తమకు అసలు లేదని అన్నారు మంచు లక్ష్మి. ఒకప్పుడు తన శ్లాంగ్‌ని వెక్కిరించేవారని, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తనలాగా మాట్లాడే అమ్మాయి కనిపిస్తోందని అన్నారు లక్ష్మి.