E-Paper
Advertisement

Prabhas: ప్ర‌భాస్‌కి 21 కోట్ల అప్పు ఇచ్చిందెవ‌రు?

Prabhas: ప్ర‌భాస్‌కి 21 కోట్ల అప్పు ఇచ్చిందెవ‌రు?
Advertisement

Prabhas:ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ 21కోట్ల రూపాయ‌లు అప్పు తీసుకున్నారు. మ‌రి అంత అప్పు ఆయ‌న‌కు ఇచ్చిందెవ‌రు? ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఇదే పెద్ద డిస్క‌ష‌న్‌. ఇయ‌ర్ ఎండింగ్‌లో అంత పెద్ద అమౌంట్ ప్ర‌భాస్‌కి ఎందుకు కావాల్సి వ‌చ్చింది?
ఆయ‌న ఏ సినిమాకూ పెట్టుబ‌డి పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. పైగా చేతినిండా సినిమాలున్నాయి. అటు అశ్వ‌నీద‌త్ కాంపౌండ్‌లో ప్రాజెక్ట్ కె చేస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఢంకా భ‌జాయిస్తున్న హోంబ‌లే ఫిలిమ్స్ లో స‌లార్ చేస్తున్నారు. మారుతి డైర‌క్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ నార్త్ వాళ్ల‌కు ఆదిపురుష్ చేశారు. మ‌రి ఇన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్న హీరోకి 21 కోట్లు అప్పు ఎందుకు కావాల్సి వ‌చ్చింది?

ఒక‌వేళ వాళ్ల పెద‌నాన్న రాధేశ్యామ్ కోసం చేసిన అప్పును క‌ట్ట‌డానికి ఇంత మొత్తం తీసుకున్నారా? లేకుంటే ఎక్క‌డైనా పెద్ద ప్రాప‌ర్టీ కొంటున్నారా? రీసెంట్‌గా గోవాలో నాగార్జున ఓ ఇల్లు క‌డుతున్నారు. అలా ప్ర‌భాస్ కూడా ఏమైనా క‌డుతున్నారా? ఏవీ లేకుంటే ఇంత అమౌంట్ ఎందుకు?. రీసెంట్‌గా ప్ర‌భాస్ హాస్పిటాలిటీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తార‌నే మాట‌లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఒక‌వేళ దానికి పెట్టుబ‌డిగా ఇంత మొత్తాన్ని తీసుకున్నారా? అయినా అంత మొత్తం ఇచ్చిన బ్యాంక్ ఏంటి? ప్ర‌భాస్ క‌డుతున్న ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ని ఆధారంగా తీసుకుని అంత అమౌంట్ ఇచ్చారా? అస‌లు ఇంత‌కు ముందు ప్ర‌భాస్‌కి అప్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే ఫ‌స్ట్ టైమ్ తీసుకున్నారా? అంటూ ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
వీట‌న్నిటికీ స్పందించ‌డానికి ప్ర‌భాస్ అస‌లు అందుబాటులో లేరు.అన్న‌ట్టు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనూ లేరు ప్ర‌భాస్‌. పెళ్లెప్పుడు అని రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ అడిగితే, స‌ల్మాన్ త‌ర్వాత అని ఆన్స‌ర్ చేశారు డార్లింగ్‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×