BigTV English

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జాభవాని షాకిచ్చారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన చెరువు భూమిని కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన కూతురు తుల్జాభవాని పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అక్రమ మార్గంలో తనకిచ్చిన భూమిని తిరిగి మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని ప్రకటించారు.


ఆదివారం చేర్యాల చెరువు వద్దకు ఆమె వెళ్లారు. తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన పనికి ఆమె చేర్యాల ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

గతంలో ఇదే భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో కబ్జా విషయాన్ని అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.


Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×