BigTV English

Olympics Selection Committee:ఒలింపిక్స్ అధికారుల ఇళ్లల్లో పోలీసుల రైడ్లు…

Olympics Selection Committee:ఒలింపిక్స్ అధికారుల ఇళ్లల్లో పోలీసుల రైడ్లు…


Olympics Selection Committee: ఒలింపిక్స్ అనేది ప్రపంచంలోనే అధునాతనమైన స్పోర్ట్స్ ఈవెంట్స్‌గా పేరుపొందింది. ఒక్కసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు.. అనుకునే క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. ఇందులో పాల్గొని మెడల్ గెలుచుకుంటే దేశానికే గర్వకారణంగా ఫీల్ అవుతారు. అయితే త్వరలో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో పలు అవకతవకలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇద్దరు ఒలింపిక్స్ అధికారుల ఇళ్లలో పోలీస్ రైడ్లు జరగడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీలో పనిచేసే ఇద్దరు అధికారుల ఇళ్లల్లో పోలీస్ రైడ్లు సంచలనం సృష్టించాయి. ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎటిని థాబాయ్స్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడోర్డ్ డానెల్లి ఇళ్లల్లో ఈ వారం సోదాలు జరిగాయి. ఇప్పటివరకు మొదటి దశ రైడ్లు ముగిసినట్టు అధికారులు తెలిపారు. అంతే కాకుండా వీరిద్దరూ పనిచేస్తున్న కన్సల్టింగ్ కంపెనీపై కూడా పోలీసులు రైడ్లు జరిపారు. వీరిద్దరిపై పలు అవినీత ఆరోపణలు ఉండడం వల్ల రైడ్లు జరిగినట్టు తెలుస్తోంది.

అనవసరమైన గొడవల్లో పాల్గొనడం, పబ్లిక్ ఫండ్స్‌ను దుర్వినియోగం చేయడం లాంటి ఆరోపణులు ఎటిని, ఎడోర్డ్‌పై ఉన్నట్టు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. దీనిపై వారి స్పందన ఏంటని అక్కడి మీడియా అడిగినప్పటికీ వారి దగ్గర నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఫ్రెంచ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎమిలీ ఒడో కాస్టెరా కూడా ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇలా జరగడం దురదృష్టకరం అంటూ కామెంట్ చేశారు. ఇలాంటి ఘటన జరగడం 2024 జులై 26న జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ ఈవెంట్‌పై ప్రభావం చూపిస్తుందని స్పోర్ట్స్ లవర్స్ అనుకుంటున్నారు.


Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×