BigTV English

Telangana BJP : బీజేపీకి జయసుధ, విక్రమ్ గౌడ్ గుడ్ బై..? కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం..

Telangana BJP : బీజేపీకి జయసుధ, విక్రమ్ గౌడ్ గుడ్ బై..? కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం..
Telangana BJP News

Telangana BJP News(Political news in telangana) :

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్‌ తగలనుంది. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్ననేతలు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఈ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు సహజనటి జయసుధ, ఆకుల రాజేందర్‌ తోపాటు యువనేత విక్రమ్‌గౌడ్‌ ఉన్నారు. వీరంతా కాషాయ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ చేరే అవకాశం ఉంది.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతోనే ఈ ముగ్గురు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఆకుల రాజేందర్‌ ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో బీఆర్ఎస్ లో చేరినా అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడంతో తిరిగి 2018లో కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావును అభ్యర్థిగా బరిలో దించడంతో పార్టీ తీరుపై అలకబూనారు రాజేందర్‌. ఈ నేపథ్యంలోనే బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు.

సహజనటి జయసుధది కూడా ఇదే పరిస్థితి. సికింద్రాబాద్‌ టికెట్‌ను జయసుధ ఆశించగా.. మేకల మేకల సారంగపాణికి ఇచ్చారు. క్రిస్టియన్‌ ఓట్లతోపాటు స్టార్‌ క్యాంపెనయిర్ గా జయసుధ కలిసి వస్తారని వ్యూహంతో ఆమెను పార్టీలో చేర్చుకుంది బీజేపీ. అయితే కమలం కండువా కప్పుకున్నారేగానీ ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇక గోషామహల్‌ ఉంచి టికెట్ వస్తుందని కలలు కన్న విక్రమ్‌గౌడ్‌కు కూడా బీజేపీ పెద్దలు మొండి చేయి చూపడంతో ఆయన కూడా పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఈ వీరంతా కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది.


.

.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×