Hydra Demolish: అమీన్‌పూర్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమంగా కట్టిన గోడను కూల్చివేసింది. గతంలో ప్రహారీ గోడను కూల్చివేశారు అధికారులు. తిరిగి తిరిగి ప్రహారీ గోడను నిర్మించడంతో మరోసారి కూల్చివేసి నేలను చదును చేసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో హైడ్రా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పెద్ద చెరువు వద్దు కొంత భూమిని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జా చేశారు. అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించారు. వాటిని మంగళవారం ఉదయం కూల్చివేసింది హైడ్రా.
2006 నుండి ఈ అంశంపై పోరాడుతున్నారు బాధితులు. ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోలేదు. చివరకు నాలుగు నెలల కిందట హైడ్రాను ఆశ్రయించారు బాధితులు. హైడ్రా కూల్చివేతల తర్వాత కొద్దిరోజులకే ఐరన్ ఫెన్సింగ్ వేసిన కబ్జా దారులు. మరోసారి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు. మళ్ళీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.
అమీన్ పూర్ పెద్ద చెరువుకు అనుకుని ఉన్న పద్మావతి నగర్ లే అవుట్ 24 ఎకరాల్లో విస్తరించింది. రాజకీయ పలుకుబడితో లేఅవుట్‌లో కొంత భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు కబ్జాదారులు. మొత్తం 294 ప్లాట్స్‌తో పద్మావతి నగర్ లే అవుట్ ఏర్పాటు చేశారు. గుడి భూములను కబ్జా చేశారన్నది స్థానికుల మాట. హైడ్రా కదలికతో మాకు న్యాయం జరిగింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్లాట్ల ఓనర్లు.
ALSO READ: కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఆరునెలల్లోనే వంద కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు
అమీన్‌పూర్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు
పెద్ద చెరువు వద్ద ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన గోడ కూల్చివేత
గతంలోనూ ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు
తిరిగి ప్రహారీ గోడను నిర్మించడంతో మరోసారి కూల్చివేత pic.twitter.com/ixCd2ylqZa
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025