E-Paper
Advertisement

Jubilee Hills BRS: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్.. ఆ ప్రోగ్రామ్స్‌కి వెలితే బ్లాక్ లిస్ట్‌లో పేరు..?

Jubilee Hills BRS: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్.. ఆ ప్రోగ్రామ్స్‌కి వెలితే బ్లాక్ లిస్ట్‌లో పేరు..?
Advertisement

Jubilee Hills BRS: స్వేచ్ఛ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గ గులాబీ పార్టీలో గ్రూప్ వార్‌కు నేతలు తెరలేపారా? మూడు వర్గాలుగా జూబ్లీహిల్స్ క్యాడర్ విడిపోయిందా? అంటే అవుననే సమాధానం పార్టీ కేడర్ లోనే వస్తుంది. జనరల్ బాడీ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం డుమ్మా కొట్టడానికి కారణం అదేననే ప్రచారం జరుగుతుంది.

2014 లో..

హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ కీలకమైన నియోజకవర్గంగా ఉంది. అయితే 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీనుంచి మాగంటి గోపీనాధ్ ఎమ్మెల్యేగా విజయంసాధించారు. అంతకుముందు 2014 లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాధ్ గెలిచారు. అయితే మాగంటి గోపీనాధ్ మరణం తర్వాత అతని సతీమణి మాగంటి సునీత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ వీఐపీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ‘కారు’ పక్కదారి పడుతోంది.

ఈగోల నడుమ గులాబీ..

Advertisement

ముగ్గురు ముఖ్య నేతల ఈగోల నడుమ గులాబీ పార్టీ రాజకీయం కాస్తా ‘మూడుముక్కలాట’గా మారింది. మాగంటి సునిత, పి. విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురు నేతలూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్ కుదేలవుతోంది. ఒకరు వెళ్తే మరొకరు రారు.. ఇంకొకరు పిలిస్తే అసలు ఎవరూ పోరు.. ఇదీ ప్రస్తుత జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ పరిస్థితి!ఫలితంగా నియోజకవర్గంలో గులాబీ దళం నానాటికీ బలహీనపడుతోందని పార్టీ కేడర్ లోనే చర్చజరుగుతుంది. మూడు వర్గాలుగానేతలు విడిపోయి ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Also read; పవన్ కల్యాణ్ ఫ్యామిలీ.. ఆపై సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మీటింగ్ ఆలస్యం..

Advertisement

నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణిసునీత,మాజీ ఎమ్మెల్యే పి.విష్ణు వర్ధన్ రెడ్డి,మాజీ కార్పోరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డివర్గాలుగా బీఆర్ఎస్ విడిపోయింది.ఎవరికివారే అధిష్టానం దృష్టిలో పడాలని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.ఈ గ్రూప్ వార్ తోనే జూబ్లీహిల్స్ జనరల్ బాడీ మీటింగ్ ఆలస్యం అయిందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చజరుగుతుంది.దీంతోవచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోవడంతోముగ్గురు నేతలు వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వర్గ పోరుకు ఆజ్యం పోసేవిధంగా గులాబీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యేపి.విష్ణు వర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ నియోజకవర్గసభ్యత్వ ఇంఛార్జ్ గా నియమించింది.

రాజకీయంగా చర్చనీయాంశం..

ఈ నెల ఫస్ట్ వీక్‌లో తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్ ను నిర్వహించారు. మాజీ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మీటింగ్‌‌కు సభ్యత్వ నమోదు ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణు వర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజా మాజీ కార్పోరేటర్లు సైతం డుమ్మా కొట్టారు. దీంతో సమావేశానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని గ్రూపు రాజకీయాలపై రియాక్ట్ అయ్యారు. మూడు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలోమెసేజ్‌లు పెట్టుకుంటున్నారన్నారు. ఇది పార్టీ మనుగడకు మంచి కాదని సూచించారు.

మరో వైపు గులాబీ పార్టీ..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాధ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడుగులాబీ పార్టీ బలంగా ఉండేది.గోపీనాధ్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ గెలిచింది. మరో వైపు గులాబీ పార్టీ క్యాడర్ వర్గాలుగా విడిపోయింది.ఈ ప్రభావంరాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడే ఛాన్స్ ఉందని గులాబీ అధిష్టానం భావిస్తోంది.అదేసమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనేతల మధ్య సమన్వయ భాద్యతలను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ అధిష్టానం అప్పగించింది.మరోవైపు గతంలోజూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి తలసానికి,మాజీ ఎమ్మెల్యే విష్ణుకు వాగ్వాదం జరిగిందనే సమాచారం.అదేసమయంలో మాగంటి సునీతతో పొసగక పోవడంతో మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి హాజరుకాలేదని సమాచారం.

Also read: Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

పెడచెవిన పెట్టిన అధిష్టానం ఆదేశాలు..

“పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి, అందరూ కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్‌లో పార్టీని పూర్వవైభవానికి తీసుకురావాలి” అని బీఆర్‌ఎస్ అధిష్టానం ఇటీవల ఈ ముగ్గురు నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ, నేతలు మాత్రం ఆ సూచనలను పెడచెవిన పెడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వారు గ్రూపులు కట్టడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది.

కేడర్‌లో ‘తమ్ముళ్ల’ గుబులు..

నేతల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్‌తో దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకున్న సాధారణ కార్యకర్తలు, కేడర్ తీవ్ర గందరగోళంలో పడిపోయారు. “ఒక నేత ప్రోగ్రామ్‌కు వెళ్తే.. ఇంకో నేత బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు” అని గులాబీ కేడర్ లబోదిబోమంటున్నారు. “ఏ నాయకుడి వెంట వెళ్తే ఎటునుంచి ముప్పు వస్తుందో.. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ఉంది. ఇలాగైతే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ మనుగడ కష్టమే” అని ఒక సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మూడుముక్కలాటకు అధిష్టానం కఠిన నిర్ణయాలతో బ్రేక్ వేయకపోతే, జూబ్లీహిల్స్‌లో గులాబీ తోట ఖాళీ అవ్వడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అయితే అధిష్టానం ఇప్పుడైనా చెక్ పెడుతుందో లేదో చూడాలి.

Also read: HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

Related News

Amit Shah: హైదరాబాద్ టార్గెట్‌గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!

HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!

Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

ప్రిన్సిపాళ్ల మధ్య ఈగో వార్.. రోడ్డున పడ్డ 200 మంది విద్యార్థినులు, అసలేం జరిగిందంటే?

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

రూ. 100 కోసం ఇంత నీచమా? ర్యాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన యువతి.. వీడియో వైరల్

Big Stories

Advertisement
×