E-Paper
Advertisement

Amit Shah: హైదరాబాద్ టార్గెట్‌గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!

Amit Shah: హైదరాబాద్ టార్గెట్‌గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!
Advertisement

Amit Shah: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాలపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మరింత ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన పర్యటన ఖరారయ్యే అవకాశముందని సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో ఆగస్టులో అమిత్ షా పర్యటన కొనసాగే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణలో కాషాయ పార్టీకి భారీగా స్కోప్ ఉందని హైకమాండ్ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తెలంగాణను బీజేపీ జాతీయ​ నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

కమిటీల పనితీరు..

Advertisement

తెలంగాణలో సంస్థాగత నిర్మాణంపై ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లా, మండల, శక్తికేంద్రం, బూత్ కమిటీల పనితీరు, క్రియాశీల కార్యకర్తల చైతన్యం, పార్టీ కార్యక్రమాల అమలుపై పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిని సరిదిద్దే దిశగా అమిత్ షా ప్రత్యేక మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపైనా అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు సమాచారం.

Also Read: Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

ప్రభుత్వంపై పోరాటాలు

Advertisement

ప్రజల్లో వారి చురుకుదనం, ప్రభుత్వంపై పోరాటాలు, స్థానిక సమస్యలపై స్పందన, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం, నియోజకవర్గ స్థాయిలో సమన్వయం వంటి అంశాలపై సమగ్ర నివేదికలు సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పనితీరు ఆశించిన స్థాయిలో లేని నాయకులకు స్పష్టమైన సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది.

జీహెచ్‌ఎంసీలో..

దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు తెలంగాణను కీలక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు సాగుతోంది. కర్ణాటక తర్వాత దక్షిణాదిలో బలమైన రాజకీయ స్థావరంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పార్టీ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ మరింత బలపడితే ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని అధిష్ఠానం అంచనా వేస్తోందని సమాచారం. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్‌గా పార్టీ భావిస్తోంది. జీహెచ్‌ఎంసీలో మెరుగైన ఫలితాలు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, అదే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన పునాది అవుతుందని నాయకత్వం విశ్వసిస్తోంది.

ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాం..

అందుకే హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త సామాజిక వర్గాలను ఆకర్షించడం, యువత, మహిళలు, వృత్తి సంఘాలు, మేధావులతో అనుసంధానం పెంచడం, బూత్ స్థాయిలో ఓటరు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికారమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం, బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్ఠం చేయడం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

Also read: 5G వద్దు.. 4Gనే ముద్దు అనుకునేవారికి.. జియో అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ ఇవే!

తెలంగాణపై ప్రత్యేక దృష్టి..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రజాప్రతినిధుల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పనితీరుపై కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమిత్ షా ఇప్పటికే రాంచందర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపినట్లు సమాచారం. అలాగే రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పొత్తులు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తుందని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మెడీ పర్యటన..

గత మే 10న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే అనే నినాదాన్ని ఇచ్చి పార్టీ తదుపరి లక్ష్యాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మేధావుల సమావేశంలో పాల్గొనగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి, మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలు, మేధావులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

అమిత్ షా పర్యటన..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయమే లక్ష్యంగా బీజేపీ గ్రౌండ్ స్ట్రాటజీని అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి వీధికి ఒక నాయకుడు-ప్రతి ఇంటికి ఒక కార్యకర్త వెళ్లేలా కార్యాచరణను రూపొందించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ, అంతకుముందే జరగనున్న ట్రై కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఇప్పటికే ఎన్నికల వ్యూహరచన ప్రారంభించినట్లు సమాచారం. అమిత్ షా పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలతో పాటు సంస్థాగత బలోపేతం, ఎన్నికల వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు, బాధ్యతల పునర్విభజనతో పాటు ఎన్నికల సన్నాహాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also read: HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

Related News

రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

Jubilee Hills BRS: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్.. ఆ ప్రోగ్రామ్స్‌కి వెలితే బ్లాక్ లిస్ట్‌లో పేరు..?

HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!

Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

ప్రిన్సిపాళ్ల మధ్య ఈగో వార్.. రోడ్డున పడ్డ 200 మంది విద్యార్థినులు, అసలేం జరిగిందంటే?

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

Big Stories

Advertisement
×