E-Paper
Advertisement

Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Advertisement

Minister Ponguleti: తెలంగాణకు ఇంధనాన్ని అందించకుండా కేంద్రం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైతే కేంద్రంతో కొట్లాడతామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. రాష్ట్ర కోటా సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

మరోవైపు ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించే లక్ష్యంతో ప్రజాదర్బార్ ను నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన న్యాయబద్ధమైన దరఖాస్తులన్నింటినీ మూడు నెలల్లోగా పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా విభజించి, ప్రతి దరఖాస్తుపై జవాబుదారీతనంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మనిషికి ఆధార్ లాగే, ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూసుమంచి మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమ చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

Also Read: బెంగాల్ ఎగ్జిట్ పోల్స్.. దీదీ హ్యాట్రిక్ కొడుతుందా? కమలం వికసిస్తుందా? షాకింగ్ రిపోర్ట్!

Advertisement

నిరుద్యోగ యువత కోసం మే 4న ఖమ్మంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. 80కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అటు వరి, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని.. నిధులను రికార్డు సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రోవైపు భూసేకరణ వంటి పెండింగ్ అంశాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.

Also Read: వామ్మో.. షావోమి గట్టిగానే ప్లాన్ చేసిందే, లీకైన 17T, 17T Pro ఫీచర్లు చూస్తే.. గూస్‌బంప్స్ రావడం పక్కా!

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×