BigTV English

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..

Hyderabad: ప్రకృతి వల్ల కావచ్చు.. మానవుల తప్పిదాల వల్ల కావచ్చు. ప్రకృతిలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి మనకు విచిత్రంగా అనిపిస్తాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో  భూమి లో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తే.. ఇలాంటివి చెప్పడం కంటే చూడడమే బెటర్. ఆ తరహా సన్నివేశం హైదరాబాద్‌లో వెలుగుచూసింది.


లొకేషన్.. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్.. సమయం కరెక్టుగా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ సన్నివేశాన్ని షాకయ్యారు.

ALSO READ: నేటివిటీని బట్టి సీటు.. జీవో నం 33పై తెలంగాణ హైకోర్టు తీర్పు


ఆ ప్రాంతం నుంచి కొందరు దూరంగా వెళ్లిపోయారు. ఈలోపు బిగ్ టీవీ టీమ్ అక్కడికి వెళ్లింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించింది. ఈలోపు చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. ఏం జరుగు తోందంటూ కాసేపు అక్కడివారు చర్చించుకోవడం కనిపించింది.

చివరకు ఓ విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల కిందట విద్యుత్ అధికారులు అండర్ గ్రౌండ్‌లో 11 కేవీ కేబుళ్లు అమర్చినట్టు తెలిసింది. దాని కారణంగానే పొగలు వచ్చాయని అంటున్నారు. అక్కడే ఉన్న మరికొందరు ఈ వాదనను తోసిపుచ్చారు.

భూ పొరల్లో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పొగలు వెనుక అసలేం జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Related News

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Big Stories

×