BigTV English
Advertisement

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Special Trains: సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్ ఏంటి? సంక్రాంతికి రైళ్లకు కోచ్‌లను పెంచుతుందా? లేకుంటే స్పెషల్‌ రైళ్లను ఏర్పాటు చేస్తుందా? ప్రత్యేకంగా రైళ్లు వేస్తే.. గమ్యస్థానం చేరుకోవడానికి మరింత ఆలస్యమవుతుందా? దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టి సారించింది.


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి. ఎక్కడున్నా ఫెస్టివల్ సమయానికి సొంతూళ్లకు వెళ్తారు.  బెంగుళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి లక్షలాది ఏపీకి వెళ్తుంటారు. ఒక్క తెలంగాణ నుంచి సంక్రాంతికి ఏపీకి దాదాపు 15 లక్షల మంది వెళ్తారన్నది అధికారిక లెక్క.

నాలుగు నెలల కిందట రైళ్లకు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. జనవరి 10 నుంచి 13 వరకు ఏ రైలు రిజర్వేషన్ చూసినా రిగ్రెట్ అని కనిపిస్తోంది. ఇక వెయిటింగ్ లిస్టు మాట్లాడాల్సిన పని లేదు. ఆయా రైళ్లకు ప్రత్యేకంగా కోచ్ వేసినా ఇంకా వెయిటింగ్ లిస్టు అలాగే ఉంటుందని అంటున్నారు.


మిగతా నగరాల నుంచి ఏపీకి వెళ్లే రైళ్ల రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్టు, రిగ్రెట్ అని చూపిస్తోంది. దీనిపై ప్రయాణికులు కాసింత ఆగ్రహంగా ఉన్నారు. కావల్సినంత రైళ్లను ఏర్పాటు చేయలేదని కొందరు మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ సైట్ మరింత చెత్తగా ఉందని అంటున్నారు.

ALSO READ: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

జరుగుతున్న పరిణామాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గమనిస్తున్నారు. సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల సమయం ఉందని అంటున్నారు. ఈలోగా వెయిటింగ్ లిస్టు తగ్గవచ్చని అంటున్నారు. ప్రస్తుతమున్న రైళ్లకు అదనంగా కోచ్‌లను యాడ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. కొందరు అధికారులు ప్రత్యేకంగా రైళ్లు వేయాలని, ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్లు చేసుకుంటారని అంటున్నారు.

వివిధ ప్రాంతాలకు తిరిగే షటిల్ రైళ్ల నుంచి సూపర్‌ఫాస్ట్ వరకు ఏది చూసినా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ మీదుగా ఒడిషా, బెంగాల్ వైపు రైళ్లు వెళ్తుంటాయి. పండుగ నెల జనవరిలో ఆయా రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. వాటికి కోచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోందట సౌత్ సెంట్రల్ రైల్వే. వీలు కుదరని పక్షంలో ప్రత్యేకంగా 400 రైళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు.

స్పెషల్ ట్రైన్ అంటే కాస్త ఫెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సౌత్ సెంట్రల్‌ డివిజన్‌కు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తే.. సమాయానికి గమ్యస్థానానికి చేరుకోవడం కష్టమని అంటున్నారు.

యథావిధిగా తిరిగే రైళ్లు సైతం అరగంట నుంచి గంట ఆలస్యం నడుస్తున్నాయని అంటున్నారు. దీనికితోడు వందే భారత్ రైళ్లు అదే రూట్లో నడుస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. దీనివల్ల మరింత డిలే అవుతుందని భావిస్తున్నారట అధికారులు. ప్రత్యేక రైళ్లపై కొద్దిరోజుల్లో అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Related News

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

CM Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్.. అందుకే ఫామ్‌హౌస్‌కి, తారలతో తిరిగే కల్చర్ ఎవరిది?

Big Stories

×