Watch LIVE IND vs BAN Test Match FREE on Sports 18 and JioCinema : ఒక 45 రోజుల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ మ్యాచ్ ఆడుతోంది. టెస్టు మ్యాచ్ గురించి చెప్పాలంటే దాదాపు ఆరు నెలలు దాటిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మనవాళ్లు ఎలా ఆడుతున్నారనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే చాలామంది క్రికెట్ మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా వస్తుందని వెతుక్కుంటూ ఉంటారు.
మీరిక శ్రమ పడక్కర్లేదు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ను జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అయితే స్పోర్ట్స్ 18 ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన జియో సినిమాలో మాత్రం ఫ్రీగా చూసేయవచ్చు.
ఇదండీ సంగతి. చెన్నై వేదికగా నేటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆల్రడీ హెడ్ కోచ్ గౌతం గంభీర్ కి టీమ్ ఇండియా ఆటగాళ్లతో గేమ్ ఎలా ఆడించాలో అర్థమైపోయింది. శ్రీలంక వన్డే సిరీస్ లా తేలికగా అయితే తీసుకోడని అంటున్నారు. ఆల్రడీ దులీప్ ట్రోఫీ ప్లాన్ అంతా కూడా గౌతంగంభీర్ దేనని అంటున్నారు. మొత్తం నాలుగు టీమ్ లు తయారుచేసి 60 మందిని సీన్ లోకి దింపాడు.
Also Read: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్
అలా జాతీయ జట్టుకి ఆడిన, సత్తా ఉన్న చిన్నా, పెద్దా క్రికెటర్లందరిని ఒక వేదికపైకి తీసుకువెళ్లాడు. బంగ్లాదేశ్ తో జరిగే తొలిటెస్టుకు ముందుగానే రంగం సిద్ధం చేసి పెట్టాడు. అయితే అక్కడ ఆడని వారిలో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్, అశ్విన్ ఉన్నారు. ఆడిన వారిలో కేఎల్ రాహుల్, యశస్వి, గిల్, పంత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ తదితరులున్నారు.
ఇకపోతే దులీప్ ట్రోఫీ ద్వారా ఎవరెవరు ఎలా ఆడుతున్నారో ఒక అంచనాకి వచ్చేశాడు. ఇప్పుడు గౌతంగంభీర్ మాత్రం కొహ్లీపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. తనీసారి డబుల్ సెంచరీ చేస్తాడని, బంగ్లాదేశ్ తో సిరీస్ విజయాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాడు. ఇక మిగిలినవారిలో యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ వీరందరూ కూడా డిఫెన్స్ బాగా ఆడతారు. కెప్టెన్ రోహిత్ శర్మది అంతా ఏసీడీసీగా ఉంటుంది. ఆడితే మంచిదే, లేకపోయినా వీరందరూ ఉన్నారు కదాని గౌతంగంభీర్ ధీమాగా ఉన్నాడు.