BigTV English

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?

Cancellation of Special Darshans, Arjitha Seva in Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థరం వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన్నట్లు టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు.


తిరుమలలో అక్టోబర్ 8వ తేదీన గరుడసేవ కోసం స్థానికంగా ఉన్న గోకులంలోని విశాంత్రి భవనంలో ఉన్నతాధికారులతో టీటీడీ సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్ వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు.

అలాగే గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్ సౌకర్యం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్, సదుపాయాలు, నీటి వసతి తదితర అంశాలపై చర్చించారు.


తిరుమలలో ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా శ్రీవారి వాహనసేవలు జరిగే ఆయలన మాడ వీధులతో పాటు తిరుమలను రంగు రంగుల హరివిల్లులతో పాటు పుష్పాలు, విద్యుత్ దీపకాంతులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్స్ పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు భక్తుల కోసం ప్రత్యేకంగా ఆలయ ముందు భాగంలోని ఖాళీ స్థలంలో తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలోని ప్రధాన మార్గాల్లో కాటేజీలు, కార్యాలయాలు, భక్తులు అధికంగా ఉండే ప్రదేశాల్లో భారీ లైటింగ్ కటౌట్లను ఏర్పాట్లు చేసింది. అయితే బ్రహ్మోత్సవాలకు ముందే అక్టోబర్ 1వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయానికి శుద్ధి కార్యక్రమం చేపడతారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, సమేత మలయప్ప స్వామివార్లను 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగింపు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలను నుంచి రాత్రి 7 గంటల వరకు సాగనుందని టీటీడీ నిర్ణయించింది. అయితే అక్టోబర్ 4 వ తేదీన సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

అక్టోబర్ 4వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంతో బ్రహ్మోత్సవాల వేడుకలు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 12వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

Also Read: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

ఇదిలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. భుధవారం స్వామివారిని 78,690మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26,086మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం లెక్కించగా.. రూ.4.18కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×