Tejeswar Case : సేమ్ టు సేమ్. మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసులానే. అక్కడ ప్లాన్ ఫెయిల్ అయి, హంతకులు దొరికిపోయారు. ఇక్కడ మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా పక్కాగా ప్లాన్ చేసి ఐశ్వర్య భర్తను చంపేద్దాం అనుకున్నారు. అనుకున్నట్టే తేజేశ్వర్‌ను లేపేశారు. కానీ, మేఘాలయ మాదిరే గద్వాల జిల్లాలోనూ హంతకులు దొరికిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తేజేశ్వర్ మర్డర్ కేసులో ఆసక్తికర నిజాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ. ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ బ్యాంక్ మేనేజర్ తిరుమల్‌రావుకు అక్రమ సంబంధం ఉందని చెప్పారు. జీపీఎస్ ట్రాకర్ పెట్టి మరీ తేజేశ్వర్‌ను ట్రాక్ చేశారు. ఇంకా చాలానే ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో. అవేంటంటే….
వాళ్లకు ఆ పిచ్చి ఎంతంటే..
ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమల్‌రావు. ఇద్దరికీ అక్రమ సంబంధం. అప్పటికే తిరుమల్‌కు పెళ్లి అయిపోయింది. మంచి ఉద్యోగం. మంచి జీవితం. అయినా ఐశ్వర్య ప్రేమలో మునిగిపోయాడు. అలా అలా చాలా చాలా దూరం వెళ్లిపోయింది వారి యవ్వారం. ఎంత దూరమంటే.. ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాతతోనూ తిరుమల్‌కు ఎఫైర్ నడిచేంతలా. అలా తల్లీకూతుర్ల మత్తులో అతడు పిచ్చెక్కి పోతున్నాడు. ఐశ్వర్య, తిరుమల్‌లు 24 గంటల పాటు వీడియో కాల్‌లో ఒకరినొకరు చూసుకుంటూనే ఉండేవారట. బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నా.. పక్కనే మొబైల్‌లో వీడియో కాల్ రన్ అవుతూనే ఉండేదట. ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా తిరుమల్‌తో వీడియో కాల్‌లో టచ్‌లో ఉండేదంటే వారి పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది. అయితే, కొన్నాళ్లకు ఐశ్వర్య తల్లికి ఓ భయం మొదలైంది. తామిద్దరం ఇక జీవితాంతం ఇలానే మిగిలిపోవాలా? తన కూతురుకు పెళ్లి చేయొద్దా? అనుకుంది. కట్ చేస్తే.. సర్వే వర్క్స్ చేసే తేజేశ్వర్‌తో ఐశ్వర్య పెళ్లి జరిగిపోయింది.
ఐశ్వర్య మహానటి యాక్టింగ్
ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచే.. మర్డర్ ప్లాన్ రెడీ చేశారు ఐశ్వర్య అండ్ తిరుమల్. అయితే, ఆ పెళ్లి తనకు ఇష్టమే అన్నట్టు నటించిందామె. తేజేశ్వర్‌తోనూ ప్రేమగా ఉంటున్నట్టు యాక్ట్ చేసింది. కాపురం చేస్తూనే తిరుమల్‌తో కలిసి తన భర్తను లేపేయాలని స్కెచ్ వేసింది. పెళ్లి అయ్యాక కూడా అతనికి వీడియో కాల్‌లో రోజూ కాంటాక్ట్‌లో ఉండేదట ఐశ్వర్య.
మేఘాలయ హనీమూన్ జంటలానే మర్డర్
తిరుమల్‌రావు మేనేజర్‌గా చేస్తున్న బ్యాంక్‌కు నగేశ్ అనే అతను లోన్ కోసం వచ్చాడు. అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిసి తేజేశ్వర్‌ను చంపాలనే ప్రపోజల్ పెట్టాడు. తాను చెప్పిన అతన్ని చంపిస్తే.. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లోన్ ఇచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అందుకు నగేశ్ ఓకే అన్నాడు. అలా ఓ సుపారీ గ్యాంగ్ కూడా రెడీ అయింది. ఇక తేజేశ్వర్‌ను చంపడమే మిగిలింది. చాలాసార్లు అటెంప్ట్ చేసినా అవన్నీ జస్ట్‌లో మిస్ అయ్యాయి. భర్తను చంపేసి.. తిరుమల్‌తో కలిసి లఢక్ కానీ, అండమాన్ కాని పారిపోయి కొన్నాళ్లు అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అంతలోనే మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసు వెలుగు చూసింది. ఆ కేసు చూసి భయపడాల్సింది మానేసి.. ఆ హంతకులు చేసిన తప్పులు మనం చేయొద్దంటూ మరింత పక్కాగా ప్లాన్ చేసి మరీ తేజేశ్వర్‌ను చంపేయాలని అనుకున్నారంతే వారెంత క్రిమినల్ మైండెడ్‌గా ఉన్నారో తెలుస్తోంది.
8మంది అరెస్ట్..
సుపారీ టీమ్‌లోని వ్యక్తులు ముందుగా తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకుని ఫ్రెండ్ షిప్ చేశారు. అతను సర్వేయర్ కావడంతో తాము రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు. తేజేశ్వర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవడానికి అతని వాహనానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. ఓ రోజు ల్యాండ్ చూద్దామంటూ నిర్మానుష ప్రదేశానికి కారులో తీసుకెళ్లారు. బండిలోనే వేట కొడవళ్లతో తల నరికారు. కడుపులో పొడిచారు. అ తర్వాత తేజేశ్వర్ డెడ్‌బాడీని కర్నూల్ ఏరియాలో నాలాలో పడేశారు. మర్డర్ చేసే టైమ్‌లో తిరుమల్‌తో హంతకులు ఫోన్ కాల్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. దుస్తులకు రక్తం మరకలు అయితే కొత్త బట్టలు కొని తీసుకొచ్చాడు. ఇలా ఈ కేసులో బ్యాక్ మేనేజర్ తిరుమల్‌రావు, అతని లవర్ ఐశ్వర్య కీలక సూత్రధారి కాగా.. ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు 8మందిని అరెస్ట్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు. హత్యకు వాడిన కారు, 2 కొడవళ్ళు, కత్తి, 10 మొబైల్స్, జిపిఎస్ ట్రాకర్, లక్షా 20వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య, A8 సుజాతనే చేర్చారు.