Jamun Fruit: ప్రకృతి నుంచి లభించే అద్భుతమైన పండ్లలో నేరేడు ఒకటి. నల్లని రంగు, తీపి, పుల్లని రుచితో నోరూరించే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిన్న పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్ల గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు:
మధుమేహ నియంత్రణ:
నేరేడు పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే జాంబోలిన్, జాంబోసైన్ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర విడుదలను నెమ్మది చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి వరం లాంటివి.
శరీర డిటాక్సిఫికేషన్:
నేరేడు పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయి.
రోగనిరోధక శక్తి పెంపు:
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల నేరేడు పండు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు , వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వీటిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుదల:
నేరేడు పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా వీటిని తినడం చాలా మంచిది.
గుండె ఆరోగ్యానికి రక్షణ:
నేరేడు పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రక్తహీనత నివారణ:
ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల నేరేడు పండు రక్త హీనతను నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు:
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతి వంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలను తగ్గించి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
Also Read: ప్రపంచమంతా బ్లూ స్కిన్ కేర్ ట్రెండ్ హవా .. ఎందుకంత స్పెషల్ ?
నోటి ఆరోగ్య సంరక్షణ:
నేరేడు పండు యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది నోటిలోని బ్యాక్టీరియాను నిరోధించి, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు:
నేరేడు పండులో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఎముకల బలోపేతం:
నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి , ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. అందుకే నేరేడు పండ్లు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.