Afghanistan Cricketers: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీస్తుంటే ఆఫ్గనిస్తాన్ తాలిబన్లు నేరుగా వెళ్లి చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వైమానిక దాడుల్లో మరణించింది ఆఫ్ఘనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లు అని తెలుస్తోంది.
పాకిస్తాన్ అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లు మరణించారు. ఆ క్రికెటర్లతో పాటు మరో ఎనిమిది మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అటు ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అధికారికంగా వెల్లడించినట్లు న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. మ్యాచ్ లు పూర్తి అయ్యాక క్రికెటర్లు ప్రాక్టికా ప్రావిన్స్ లోని షరానా నుంచి ఆర్గోన్ కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బాంబు దాడులు జరిపింది. దీంతో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్లబ్ లెవెల్ క్రికెటర్లతో పాటు 8 మంది మరణించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలు అయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌గా గుర్తించారు.
పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు ఇప్పటినుంచి జరుగుతున్నది కాదు. దీని వెనుక చాలా చరిత్ర ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వివాదానికి ముఖ్యమైన కారణం డ్యూరాండ్ రేఖ సరిహద్దు వివాదం. పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్ తాలిబన్ అంశం కూడా ఒకటి. అంతే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు, సరిహద్దు సమస్యలు కూడా ఈ గొడవకు దారితీస్తున్నాయి.
ఇక అక్టోబర్ 9వ తేదీ 2025 అంటే మొన్న గురువారం రోజున కాబూల్ సహా పలు ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో చాలామంది ఆఫ్గనిస్తాన్ పౌరులు మరణించారు. ముఖ్యంగా టీటీపీ నాయకుడు నూరు వాలి లక్ష్యంగా ఈ దాడులు చేశారు. కానీ అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ టీటీపీ నాయకుడికి ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇస్తోందని పాకిస్తాన్ కు కోపం. అయితే ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది ఇండియా. దీంతో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. అంతేకాదు దొంగ దెబ్బ తీయాలని పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే, తాలిబన్స్ మాత్రం నేరుగా చూసుకుందాం అంటున్నారు.
Three Afghan cricketers amongst eight people killed in Paktika strikes by Pakistan.
The cricketers have been identified as Kabeer, Sibghatullah and Haroon pic.twitter.com/vNHarFqIWf— Yeshi Seli (@YeshiSeli) October 18, 2025