Big Stories

Kavitha: కవితకు షెల్ కంపెనీలు.. మరో బాంబ్ పేల్చిన సుఖేష్..

kavitha

Kavitha ed news(Telugu breaking news today): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి బుధవారం సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న ఆయన బుధవారం లేఖను విడుదల చేశాడు సుఖేశ్‌. ఢిల్లీ సీఎం అధికారిక నివాసంలో ఫర్నీచర్‌ కోసం ఎమ్మెల్సీ కవిత నుంచి డబ్బులు వెళ్లాయన్నాడు. కవితకు చెందిన ‘షెల్’ అకౌంట్ల నుంచి 80 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ కు చేరాయన్నాడు.

- Advertisement -

మొత్తం మూడు విడతల్లో ఎమ్మెల్సీ కవిత ‘షెల్’ ఖాతా నుంచి రూపాయలు 80 కోట్లు మారిషస్‌లోని ‘గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్’ అనే కంపెనీకి బదిలీ అయినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ కంపెనీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి కైలాష్ గెహ్లాట్ బంధువులకు చెందినది ఆయన వివరించాడు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి ఈ లావాదేవీలు జరిగాయన్నాడు. కేజ్రీవాల్ ఆదేశాలకు సంబంధించిన ఐ-ఫోన్ ఫేస్ టైమ్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లన్నింటినీ త్వరలోనే వెల్లడిస్తానని సుఖేష్ చంద్ర శేఖర్ ప్రకటించాడు.

- Advertisement -

కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి మొదటి సారి 25 కోట్లు, ఆ తర్వాత మరో 25 కోట్లు, మూడోసారి 30 కోట్ల రూపాయల చొప్పున బదిలీ అయ్యాయన్నాడు. ఎమ్మెల్సీ కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి ‘గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్’ కంపెనీకి ఫండ్స్ బదిలీ అయిన తర్వాత.. అవి యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీ రూపంలో కన్వర్ట్ అయినట్లు సుఖేశ్ తెలిపాడు. అక్కడి నుంచి అవి అబుదాబికి వెళ్లాయన్నాడు. ఈ వ్యవహారం అంతా.. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే జరిగినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించాడు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తానీ వ్యవహారంలో చొరవ తీసుకుని ఆపరేషన్‌ను కంప్లీట్ చేసినట్లు చెప్పాడు. సుఖేశ్‌.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గతంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాడు. వాటిని వాపస్ తీసుకోవాల్సిందిగా తనపైన ఒత్తిడి వస్తున్నట్లు తాజా లేఖలో ప్రస్తావించాడు. ఉద్దేశపూర్వకంగానే తనను తీహార్ జైలు నుంచి మండోలికి మార్చారని ఆరోపించాడు. అక్కడి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓం ప్రకాశ్, దీపక్ కుమార్, మరికొంతమంది సిబ్బంది కేజ్రీవాల్‌కు నమ్మినబంట్లు అని, అందువల్లనే తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారన్నాడు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు సుఖేష్. జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఈ విషయంపై ఫిర్యాదు చేశానని తెలిపాడు. త్వరలో కేజ్రీవాల్ కుంభకోణాలను వరుసగా వెలుగులోకి తెస్తానని సుఖేష్ చంద్రశేఖర్ హెచ్చరించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News