BigTV English

Sunkishala Project: సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా నీటికొరత రాకూడదనే..! కేటీఆర్

Sunkishala Project: సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా నీటికొరత రాకూడదనే..! కేటీఆర్

KTR About Sunkishala Project: హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయివేగంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల్లో విశ్వాసం పెంచామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సుంకిశాల విపత్తుపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా.. నీటిని ఎత్తిపోసేందుకే సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు.


ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయాలంటే..నాగార్జున సాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉండాలన్నారు. అలాగే నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ 460 ఫీట్లు ఉన్నప్పటికీ హైదరాబాద్‌కు 50 ఏళ్లపాటు తాగునీటి అవసరాలు తీర్చేలే ప్రాజెక్టు నిర్మించినట్లు చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశాలతో సుంకిశాలకు మంత్రులతో కలిసి పరిశీలించామన్నారు. కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. సుంకిశాల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు, సాగు, తాగునీటి కోసం ఉపయోగపడుతుందన్నారు.

సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఆనాడు హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు మొదలు పెట్టామన్నారు. సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని వెల్లడించారు. కానీ సుంకిశాల ఘటనను ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. పనులు చేస్తున్న ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, సుంకిశాల ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వెరీ చేయాలని డిమాండ్ చేశారు.


హైదరాబాద్ తాగునీటి కోసం మూడు పైపుల ద్వారా సుంకిశాల నుంచి కోదండపురం వరకు పైపులైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. మళ్లీ అక్కడినుంచి ఎత్తిపోసి కోదండపురం, నరసల్లపల్లి, గుంగల్, సాహెబ్ నగర్ ప్రాంతాలకు ప్లాంట్స్ నిర్మించామని, అక్కడినుంచి హైదరాబాద్ పంపింగ్ జరుగుతుందన్నారు.

Also Read: తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్.. అమెరికా వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్

ఈ ప్రాజెక్టు కృష్ణానదికి మూడు నుంచి నాలుగేళ్లు వరద రాకపోయినా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని తీసుకునేలా చేశామన్నారు. ఆనాడు కేసీఆర్ విజన్ ఏంటంటే.. కృష్ణా నీటితోపాటు ఎల్లంపల్లి నుంచి గోదావారి నీళ్లు, మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ రింగ్ మెయిన్ నిర్మాణం చేసేలా ఆలోచించి శ్రీకారం చుట్టామన్నారు. ఈ విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రాంతానికి నీటి ఇబ్బందులు లేవన్నారు.

Related News

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Big Stories

×