Mlas Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేవలం మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వీలైనంత త్వరగా అంటే మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది.
తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అపరేషన్ సక్సెస్..పేషెంట్ డైడ్ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.
గతంలో ఐదుగురు సభ్యుల గల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ప్రస్తావించింది ధర్మాసనం. అప్పటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని, స్పీకర్‌కు కాల పరిమితి విధించాలని తన తీర్పులో ప్రస్తావించారు.
ALSO READ: దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. తాము విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని భావించారు. చివరకు న్యాయస్థానం.. స్పీకర్‌కు అప్పగించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీ ఫైట్ చేయలేకపోతోందని గుసగుసలు లేకపోలేదు. అంతర్గత సమస్యలతో పార్టీ సతమతమవుతోందని అనుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
BREAKING
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సంచలన తీర్పు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి
మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యాయస్థానమే వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ లను… https://t.co/ACKga2dzlQ
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025