Child Marriage: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిన ఒక బాల్య వివాహం సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం కందివాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి శ్రీనివాస్ గౌడ్‌తో మే 28, 2025న బలవంతంగా వివాహం జరిపించారు. ఈ ఘటన భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, సమాజంలో ఇప్పటికీ పాతుకుపోయిన ఆచారాలు, ఆర్థిక ఇబ్బందుల పరిణామాలను బహిర్గతం చేస్తుంది.
అత్తగారింటికి వెళ్లడానికి ఇష్టపడని బాలిక..
ఈ వివాహం బాలిక తల్లి స్రవంతి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యవర్తి పెంటయ్య సహాయంతో ఏర్పాటనైట్లు చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ గౌడ్‌కు ఆస్తి ఉందని చెప్పి, మధ్యవర్తి ఈ సంబంధాన్ని ఖరారు చేశాడు. వివాహం అయిన తర్వాత బాలిక అత్తగారింటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. తనకు చదువుకోవాలనే ఆకాంక్షను ఆమె పాఠశాల ఉపాధ్యాయులతో పంచుకుంది. బాలిక ఆవేదనను అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు వెంటనే తహసీల్దార్ రాజేశ్వర్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌లకు సమాచారం తెలిపారు.
బాలికను సఖి సెంటర్‌కు తరలింపు
అధికారులు రంగంలోకి దిగి ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలికను సురక్షితంగా సఖి సెంటర్‌కు తరలించారు, ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, రక్షణ అందిస్తున్నారు. ఈ వివాహంలో పాల్గొన్న బాలిక తల్లి స్రవంతి, వరుడు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తి పెంటయ్యలపై బాల్య వివాహ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానిక సమాజంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: నేడు ప్రభుత్వం ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్..
అయితే బాలిక భవిష్యత్తు రక్షణ కోసం అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘటన బాలల హక్కుల రక్షణ, విద్యా అవకాశాల ప్రాముఖ్యతను మరోసారి నొక్కిచెప్పింది. సమాజంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పౌరులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెబుతున్నారు.
13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఘటన
8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40)తో మే 28న బాల్య వివాహం
బాలికకు అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఉపాధ్యాయులకు సమాచారం… pic.twitter.com/xc0PgFWhn3
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025