E-Paper
Advertisement

Police Suspension : ఇద్దరు ఇన్‌స్పె‌క్టర్లు సస్పెండ్.. సైబరాబాద్ సిపీ ఆదేశాలు జారీ..

Police Suspended: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్‌ల పై సస్పెండ్ వేటు పడింది. కెపీహెచ్ బీ ఇన్ స్పెక్టర్ వెంకట్, ఆర్.జి.ఐ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసు లను సస్పెండ్ చేస్తూ సిపీ అనినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

Police Suspension :  ఇద్దరు ఇన్‌స్పె‌క్టర్లు సస్పెండ్.. సైబరాబాద్ సిపీ ఆదేశాలు జారీ..
Advertisement

Police Suspension : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్‌ల‌పై సస్పెన్షన్ వేటు పడింది. కెపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్‌జీఐ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ సిపీ అనినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

కెపీహెచ్ బీ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఇన్స్పెక్టర్ వెంకట్‌పై వేటు పడింది. భార్యాభర్తల కేసు వివాదంలో జోక్యం చేసుకొని ప్రణీత్ అనే వ్యక్తిని కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ వెంకట్ చితకబాదాడు. ప్రస్తుతం బాధితుడు ప్రణీత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. సిపీ అవినాష్‌ మహంతికి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై దర్యాప్తు చేసిన ఉన్నతాధికారుల రిపోర్టు మేరకు సైబరాబాద్ సీపీ కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ వెంకట్ ‌ను సస్పెండ్ చేశారు.

Advertisement

మరోవైపు శంషాబాద్‌లోని ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్‌లో సీఐగా చేసిన శ్రీనివాసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని సీపీ నిర్ధారణకు వచ్చారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు సీపీ అవినాష్ మహంతి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×