E-Paper
Advertisement

Telangana Big Tv Exit Polls | బిగ్ టీవి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. దూసుకుపోతున్న కాంగ్రెస్.. బిఆర్ఎస్ వెనుకంజ!

Telangana Big Tv Exit Polls | బిగ్ టీవి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టం ఆధిక్యం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిశాక బిగ్ టీవి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

Telangana Big Tv Exit Polls | బిగ్ టీవి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. దూసుకుపోతున్న కాంగ్రెస్.. బిఆర్ఎస్ వెనుకంజ!
Advertisement
Telangana Big Tv Exit Polls

Telangana Big Tv Exit Polls(Telangana election update):

బిగ్ టీవి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిశాక బిగ్ టీవి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

దాదాపు లక్ష మంది అభిప్రాయాలను సేకరించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది బిగ్ టీవి. ఈ లక్ష మందిలో ప్రతి నియోజకవర్గంలో 900 మందిని శాంపిల్ గా ప్రశ్నించారు. అయితే మిగతా సర్వేలలో తెలిపినట్లే కాంగ్రెస్‌ ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో అగ్రస్థానం సాధించినప్పటికీ.. బిఆర్ఎస్‌కు అత్యధికంగా 40 స్థానాలు రావడం గమనార్హం. అయితే ప్రధాన మంత్రి మోదీ, ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ లాంటి వారు ప్రచారాల్లో ఎంతో గాంభీర్యం ప్రదర్శించినా బిజేపీ కనీసం పది స్థానాలు సాధించలేదని తేలడం శోచననీయం.

Advertisement

బిగ్ టీవి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్..
కాంగ్రెస్ 68-77
బిఆర్ఎస్ 32-41
బిజేపీ 5-8
ఎంఐఎం 5-6
ఇతరులు 0-1

Advertisement

తెలంగాణలోని నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్‌లో హస్తం గాలి గట్టిగా వీస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్‌, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లా నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఉంటుందని బిగ్ టీవి సర్వే ప్రజాభిప్రాయాన్ని తెలిపింది. సిఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో షాకింగ్ ఫలితాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ 3-4 స్థానాలకే పరిమితం కానుంది.

మరో ఆశ్చర్యం ఏమిటంటే.. ఎంఐఎం మజ్లిస్ పార్టీకి 5-6 స్థానాలే రావడం. ఎంఐఎం ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 9 సీట్లు గెలుచుకోగా.. ఈసారి ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఇంత మెజారిటీ సాధిస్తుందనే దానికి కారణాలు ఏమిటని ప్రశ్నించగా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కొందరు చెప్పగా.. కేసీఆర్ పాలనలో నిరుద్యోగ సమస్య అని మరికొందరు చెప్పారు. మరికొందరైతే రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు గట్టిపోటీ ఇవ్వగలరనే భావనను ప్రకటించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×