E-Paper
Advertisement

ఎనీ టైమ్ మేం సిద్ధమే.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు రాంచందర్‌రావు, ఎంపీ అరవింద్ సవాల్

ఎనీ టైమ్ మేం సిద్ధమే.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు రాంచందర్‌రావు, ఎంపీ అరవింద్ సవాల్
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు ఓ రేంజ్‌లో హీటెక్కాయి. ఓ వైపు అధికార కాంగరెస్- విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా బీజేపీ ఎంటరైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. అసలేం జరిగింది?

అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బీజేపీ రాంచందర్‌రావు సవాల్

Advertisement

తెలంగాణ అభివృద్ధి కోసం నిధుల విషయంలో తాము చర్చకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు తెలంగాణ బీజేపీ రాంచందర్‌రావు. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రెండేళ్లలో దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. గణాంకాలతో సైతం ఆయన వెల్లడించారు.

ఈ విషయంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. నిధులు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధమనేనన్నారు. మీరు ఎప్పుడు సిద్ధమైతే తాను వస్తానన్నారు. అదే సమయంలో హరీశ్‌రావు ఢిల్లీకి వచ్చిన విషయంపైనా మాట్లాడారు.

Advertisement

కేంద్రం నిధుల విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమే

కాళేశ్వరం కేసులో చట్టపరమైన సలహాల కోసమే ఆయన వచ్చారన్నారు. తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణ కోరాల్సిపోయి కేవలం బ్యారేజీల మీద విచారణ కోరడం ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

అటు కాంగ్రెస్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.72 ఏళ్ల వయస్సులో కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూముల ధరలు పెరిగాయని చెప్పడంపై ధ్వజమెత్తారు.

ALSO READ: నిద్రపోయిన స్మగ్లర్లకు వరంగల్ పోలీసుల షాక్.. కోట్లాది రూపాయల హాష్ ఆయిల్ పట్టివేత

ఆ సమయంలో దేశవ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయన్నారు. కేసీఆర్ చేసినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. అన్ని విభాగాల్లో బకాయిలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో సివిల్ సప్లయ్ విభాగంలో అక్రమాలు ప్రారంభమయ్యాయని రుసరుసలాడారు.

 

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×