Vijayasaireddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల ఫలితాలు అధికార పార్టీలో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. ఇంతకీ సాయిరెడ్డి మాటల వెనుక అసలు అర్థం ఏంటి? ఇవే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమిలో జోష్ నింపింది. అసెంబ్లీ ఫలితాలు మాదిరిగానే స్థానిక సంస్థల రిజల్ట్ వచ్చింది. ఇంకా ఎక్కువగా వచ్చాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. కానీ ఎక్కడో చిన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది. ఈ స్థాయి ఫలితాలు వచ్చాయంటే.. ఇంకా మంచి పాలన సాగించాలి, లేకుంటే ఓటర్లు పక్కన పెట్టేస్తారు.
తాజాగా మాజీ ఎంపీ విజయసాయరెడ్డి కూడా సరిగ్గా అలాంటి వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఓడించినది.. ప్రతిపక్షాన్నా లేక ప్రజలనా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్న లేవనెత్తాను. అధికార పార్టీలో ఇప్పుడు ఆత్మ విశ్వాసం కంటే భయం ఎక్కువగా కనిపిస్తోందని రాసుకొచ్చారు. పోలీసుల్ని గుండాలుగా, గుండాల్ని మాఫియాలుగా మార్చి ఎన్నికలు జరిపారని పేర్కొన్నారు.
కాబట్టి ఓడినది ప్రజలని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీలో 2029 భయం మరింత పెరగటానికి ఈ ఫలితాలు బాగా ఉపయోగపడతాయని మనసులోని మాట బయటపెట్టారు. వీఎస్ఆర్ మాటల వెనుక అసలు అర్థం ఏంటని కొందరు వైసీపీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఏదో సరదాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రత్యర్థి పార్టీల్లో ఓ డౌట్‌ను క్రియేట్ చేయడం వెన్నతో పెట్టిన విద్యగా చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే సాయిరెడ్డి కామెంట్స్ వైసీపీ హెల్ఫ్ అవుతాయని అంటున్నవాళ్లు లేకపోలేదు.
ALSO READ: ఓట్లు మీరే వేసుకుంటే ఇక ప్రజలతో పనేంటి?.. కూటమిపై విరుచుకుపడ్డ షర్మిల!
విజయసాయిరెడ్డి కుటిల పన్నాగాలు అందరికీ తెలుసని, ఆయన నుంచి ఇలాంటి కాకుండా మరేమీ ఆశించలేమని అంటున్నారు కొందరు కూటమి నేతలు. అయినా రాజకీయ నేతలు ప్రత్యర్థుల గురించి ఏదో ఒక కుంటిసాకులు చెబుతారని అంటున్నారు. సాయిరెడ్డి రాతల మాట పక్కనపెడితే.. ఇంతకీ కొత్త పార్టీ ఎంతవరకు వచ్చిందంటూ పలువురు కూటమి పార్టీ కార్యకర్తలు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఇంతకీ పార్టీ ఉందా? గడియలు బాగా లేవని మరొక ముహూర్తం ఫిక్స్ చేస్తారా? అంటూ లేవనెత్తుతున్నారు.