E-Paper
Advertisement

క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఇక హైదరాబాద్ రానక్కర్లేదు.. జిల్లాల్లోనే ఉచిత కీమోథెరపీ!

క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఇక హైదరాబాద్ రానక్కర్లేదు.. జిల్లాల్లోనే ఉచిత కీమోథెరపీ!
Advertisement

Cancer Care: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో హైదరాబాద్‌కే పరిమితమైన కేన్సర్ వైద్య సేవలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ డే కేర్ కేన్సర్ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడే కీమో థెరపీ సేవలు అందిస్తున్నామన్నారు. రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో కేన్సర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు కొండిబా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, డీఎంఈ వాణి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ సదాశివుడు, నిమ్స్‌ డైరెక్టర్ రాహుల్‌ దేవరాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కీమో థెరపీ సెంటర్ల పనితీరుపై మంత్రి ఆరా

Advertisement

ఎంఎన్‌జే, నిమ్స్ హాస్పిటల్స్‌లో కేన్సర్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలను మంత్రికి అధికారులు వివరించారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన కీమో థెరపీ సెంటర్ల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ఎంఎన్‌జే, నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ ప్రారంభించి.. కీమో థెరపీసేవలను జిల్లాల్లో అందిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. జిల్లాల వారీగా పేషెంట్లను మ్యాపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాల్లో కీమో థెరపీ సేవలు పొందుతున్న పేషెంట్ల సంఖ్యను మరింత పెంచాలని,హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరాన్ని తగ్గించి..పేషెంట్లకుసౌకర్యవంతంగా తమ జిల్లాకేంద్రంలో కీమో సేవలు అందేలా అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కేన్సర్ ప్రివెన్షన్, స్క్రీనింగ్‌పై మరింత దృష్టి సారించాలని మంత్రి సూచించారు. జనవరి నాటికి 4 కొత్త మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లు

Advertisement

కేన్సర్ ప్రివెన్షన్, స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్ విషయంలో తెలంగాణ ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. కేన్సర్‌‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా గుర్తించడం, కేన్సర్ రిజిస్ట్రీ, కేన్సర్ పోర్టల్‌ను ప్రారంభించడం వంటి చర్యలు కేన్సర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లు పెట్టి కీమో థెరపీ సెంటర్లు జిల్లాల్లోనే అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. ఎంఎన్‌జే హాస్పిటల్స్‌, నిమ్స్‌ హాస్పిటల్‌లో కేన్సర్ పేషెంట్ల కోసం మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, రొబోటిక్ సర్జరీలు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్నిరకాల ఎక్విప్‌మెంట్‌ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కేన్సర్ పేషెంట్లు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

వరంగల్ స్పీడప్..

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్‌ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్‌బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష చేశారు. సెక్రటేరియట్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో హాస్పిటల్‌లో ప్రతి ఫ్లోర్ ప్లాన్‌ను మంత్రి పరిశీలించారు. తొలుత అవుట్‌ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఇందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, ఓపీ కన్సల్టేషన్‌ రూమ్‌లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్‌ తదితర సేవలకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి అవుట్ పేషెంట్ సేవలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. 6 ఆపరేషన్ థియేటర్లు సైతం సిద్ధమవుతాయని తెలిపారు. ఒక్కసారి పేషెంట్‌ హాస్పిటల్‌కు వచ్చాక, మరో హాస్పిటల్‌కు రిఫర్ చేసే ప్రసక్తే ఉండకూడదని, అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉండాలని మంత్రి సూచించారు.

అధికారులకు మంత్రి ఆదేశాలు..

ప్రభుత్వం నియమించిన డాక్టర్ల బృందం వరంగల్ హాస్పిటల్‌, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటళ్లను రెగ్యులర్‌‌గా విజిట్ చేయాలని మంత్రి ఆదేశించారు. అల్వాల్ టిమ్స్‌ పనులు సైతం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్‌ జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఎల్‌బీ నగర్ టిమ్స్ పనులు చివర దశకు వస్తాయని అధికారులు తెలిపారు. పనులన్నీ స్పీడప్ చేయాలని, వీలైనంత త్వరగా హాస్పిటళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Also Read: మోదీ దీపావళి సెంటిమెంట్ నుండి అమెరికా స్పీచ్ వరకు.. బన్సాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags

Related News

మోదీ దీపావళి సెంటిమెంట్ నుండి అమెరికా స్పీచ్ వరకు.. బన్సాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

షూటింగ్స్‌కు వెళ్లవద్దని బాబాయ్ మందలింపు.. 21 ఏళ్ల  యువతి ఆత్మహత్య!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. మిత్రపక్షాల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి

నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా! తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: బండి సంజయ్

చెంగిచెర్లలో హైడ్రా హల్చల్.. రియల్ ఎస్టేట్ ముఠా దందా గుట్టు రట్టు!

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!

జలమండలికి సవాల్‌తో కూడిన మెగా ఆపరేషన్.. చకా చకా రిపేర్లు!

Big Stories

Advertisement
×