BigTV English

Class 10 advanced Supplementary Results Out: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Class 10 advanced Supplementary Results Out: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Class 10 advanced Supplementary results released: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (జూన్ 28) మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్స్ చూసుకోవచ్చని తెలంగాణా పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.


మొత్తం 46,731 మంది విద్యార్థులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 34,126 మంది (73.03 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. బాలుర ఉత్తీర్ణత 71.01 శాతం, బాలికల ఉత్తీర్ణత 76.37 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల కోసం జులై 8 వరకు అవకాశం కల్పించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 170 పరీక్షా కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Also Read: త్వరలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..


ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేసింది. జూన్ 24న ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.86 శాతం, సెకండియర్ లో 43.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు జరిగాయి.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×