BigTV English

TG Group 1 Prelims Results: త్వరలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..!

TG Group 1 Prelims Results: త్వరలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..!

TG Group 1 Prelims Results: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై బిగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆఱ్ ఇమేజింగ్ షీట్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.


గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దానిపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని కూడా టీజీపీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సారి మెయిన్స్ ను ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అనేదే ఉత్కంఠగా మారింది. కాగా ఈ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:50కి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇప్పటికే అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని కూడా కోరుతున్నారు.


Also Read: Class 10 advanced Supplementary Results Out: తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న వేళ టీజీపీఎస్సీ 1 : 50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

కాగా, రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షను దాదాపు రెండు సార్లు వాయిదా వేసి ఇటీవల మూడోసారి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అందువల్ల అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.

Also Read: Kale Yadaiah Jumps Into Congress: మరో వికెట్ కోల్పోయిన బీఆర్ఎస్‌.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే:

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను అన్ని భాషల్లో రాసేందుకు అభ్యర్థుల కోసం ఏర్పాటు చేశారు.

Tags

Related News

Birthday Bumps: బర్త్‌డే బంప్స్ అంటూ ‘అక్కడ’ కొట్టిన ఫ్రెండ్స్, చివరికి దారుణ పరిస్థితి

Bathukamma Festival: మన హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిఎత్తైన బతుకమ్మ.. రెండు కళ్లు సరిపోవు..

Telangana Transgenders: హైదరాబాద్ మెట్రో సెక్యూరిటీ గార్డులుగా.. ట్రాన్స్ జెండర్లు..!

Mallanna New Party: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న

Hydra DRF Staff Protest: హైడ్రా కార్యాలయం వద్ద హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

CM Revanth Reddy: విద్యా విధానంలో కీలక మార్పులు..? రేవంత్ సంచలన నిర్ణయం

Pre Launch Scam: ఫ్రీ లాంచ్ ఆఫర్లు అంటూ.. వంద కోట్ల మోసం

Telangana Liberation Day: పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రులు

Big Stories

×