E-Paper
Advertisement

Telangana CM : నేడు తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజ్ భవన్ లో కార్యక్రమం..

Telangana CM : నేడు తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజ్ భవన్ లో కార్యక్రమం..
Advertisement
Telangana CM News

Telangana CM News(Political news in telangana):

రాజ్ భవన్‌లో ఇవాళ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. సాయంత్రం సీఎంతోపాటు మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. అందుకు తగ్గట్లు రాజ్ భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది . సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే తీర్మానం కాపీని రాజ్‌ భవన్‌కు పంపించనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తులు మొదలుపెట్టింది. సీఎల్పీ భేటీ కానున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలంతా మీటింగ్ జరిగే ఎల్లా హోటల్‌ దగ్గరకు చేరుకుంటున్నారు. సీఎల్పీ సమావేశంలో తమ నాయకుడ్ని ఎన్నుకుంటారు. పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని.. అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ… నూతన ఎమ్మెల్యేలు సమిష్టిగా కోరుకుంటున్నారు . కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్న రేవంత్‌ కంటే… అర్హుడైన నేత ఎవరు ఉన్నారని వారంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.

Advertisement

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే రాజ్‌భవన్‌ వెళ్లి.. నిన్న గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిది కోరారు. కాంగ్రెస్ విజేతల జాబితాను గవర్నర్‌కు ఇచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×