BigTV English

Renu Desai Birthday : బద్రి బ్యూటీ.. బర్త్ డే స్పెషల్..

Renu Desai  Birthday : బద్రి బ్యూటీ.. బర్త్ డే స్పెషల్..
Renu Desai  Birthday

Renu Desai Birthday : రేణు దేశాయ్ ఈమె హీరోయిన్ గా కంటే కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ బాగా తెలుసు. రేణు దేశాయ్ మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడిన ఒక గుజరాతి కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో జన్మించింది. మోడలింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో మెల్లిగా మోడలింగ్ మొదలుపెట్టిన రేణు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టింది. 


పార్థిబన్ హీరోగా 2000 లో వచ్చిన తమిళ్ మూవీ లో వెండితెరకు రేణు దేశాయ్ పరిచయమైంది. ఆ తర్వాత అదే సంవత్సరం తెలుగులో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన బద్రి మూవీలో హీరోయిన్గా ఆమెకు ఛాన్స్ వచ్చింది. బద్రి మూవీ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో ఏర్పడిన పరిచయం ఫ్రెండ్షిప్ గా.. క్రమంగా ప్రేమగా మారడంతో వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు.

పవన్ కళ్యాణ్ తో ప్రేమాయణం మొదలుపెట్టిన తర్వాత రేణు మరింత ఎవరితోనూ సినిమాలు చేయలేదు. బద్రి తర్వాత తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక చిత్రం జానీ అది కూడా పవన్ కళ్యాణ్ తోటే. పవన్ తో విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన రేణు.. రీసెంట్ గా వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో హేమలత లవణం పాత్ర పోషించింది. సంఘసంస్కర్త అయిన హేమలత లవణం పాత్ర ఈ చిత్రంలో కాసేపే అయినప్పటికీ దాని ప్రభావం చిత్రంపై ఎంతో ఉంటుంది. అటువంటి భారీ పాత్రలో నటించి మెప్పించింది రేణు.


పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సాగించిన సహజీవనం అప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారింది. వీళ్ళిద్దరికీ 2004లో అకిరా పెళ్లికి ముందే పుట్టాడు. ఆ తర్వాత 2009లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీళ్ళు.. 2012లో విడిపోయారు. పవన్ తో పరిచయం తర్వాత నటిగా రేణు దేశాయ్ తన కెరీర్ కు ఒకరకంగా ముగింపు చెప్పిందని చెప్పాలి. 

అయితే ఆ తర్వాత కూడా..ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం లాంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.డైవర్స్ తర్వాత తన ఇద్దరు పిల్లలు..అకీరా నందన్,ఆద్యా తో ఉంటున్న రేణు.. తమ బంధం పై తరచూ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్లను కూడా ఒంటరిగానే ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ తిరిగి నటలపై తన దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోంది. అందాల రేణుకి బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×