E-Paper
Advertisement

Telangana CM : రేపే రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లు ముమ్మరం..

Telangana CM  : రేపే రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లు ముమ్మరం..
Advertisement
Telangana news

Revanth Reddy as Telangana CM(Telangana politics) :

తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రేపు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణస్వీకారోత్సవానికి తొలుత రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణం చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, బలరాంనాయక్‌ ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న రేవంత్‌కు తెలంగాణ భవన్‌ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే ప్రొటోకాల్‌ బృందం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అధికారిక వాహనాలతో కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారానికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ రవి గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్‌, హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను వేదిక వద్ద ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలిస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×