E-Paper
Advertisement

విదేశీ ఉద్యోగాల కోసం సీఎం కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవే!

విదేశీ ఉద్యోగాల కోసం సీఎం కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Overseas Employment Scheme: విదేశాల్లో మంచి ఉద్యోగం చేయాలని చాలా మంది యువతకు కల ఉంటుంది. కానీ వీసా ఖర్చులు, విమాన టికెట్లు, భాషా శిక్షణ చూసి ఖర్చు ఎక్కువవుతుందని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి నిరుద్యోగ యువతకు అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం ఓవర్‌సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్’ తీసుకొచ్చింది. జీవో నంబర్ 19 ద్వారా వచ్చిన ఈ పథకాన్ని టామ్‌కామ్ ద్వారా అమలు చేస్తున్నారు. మొదటి ఏడాది 7 వేల మందికి సాయం చేయాలనేది లక్ష్యం.

సబ్సిడీ ఎలా ఇస్తారు?

Advertisement

ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. భాషా శిక్షణ అవసరం లేకుండా నేరుగా వెళ్లే వారికి వీసా, విమాన ప్రయాణ ఖర్చులపై గరిష్ఠంగా రూ.లక్ష వరకు లెక్కించి, అందులో సగం అంటే రూ.50 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇక విదేశీ భాష నేర్చుకుని వెళ్లే వారికి రూ.3.50 లక్షల వరకు పరిగణించి, 50 శాతం చొప్పున రూ.1.75 లక్షల వరకు సాయం అందుతుంది. మిగతా సగం డబ్బును అభ్యర్థి పెట్టుకోవాలి. కుదరకపోతే బ్యాంకు రుణాల కోసం టామ్‌కామ్ ఏర్పాట్లు చేస్తుంది. రెండో కేటగిరీలో భాషా శిక్షణ సబ్సిడీ లేదా ప్రయాణ సబ్సిడీ.. రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకోవాలి.

ఎవరు అర్హులు? ఏమేం కావాలి?

Advertisement

వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి. ఐటీఐ చేసేవారైతే గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి. ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ నిబంధనల ప్రకారం ఉంటుంది. పని అనుభవం రెండేళ్లు ఉండాలి. కానీ, దేశాల నిబంధనలను బట్టి మినహాయింపులు ఉండవచ్చు. పాస్‌పోర్టు గడువు కనీసం ఆరు నెలలు ఉండాలి, మెడికల్ టెస్ట్‌లో పాస్ కావాలి. ఒక రేషన్ కార్డుపై కుటుంబంలో ఒక్కరికే ఇది వర్తిస్తుంది. మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది.

దరఖాస్తు, ఎంపిక ఎలా జరుగుతుంది?

టామ్‌కామ్ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు తీసుకోరు. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్, పాస్‌పోర్టు, విద్యార్హత, అనుభవ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. దరఖాస్తుల పరిశీలన తర్వాత 30 రోజుల్లో ఎంపిక పూర్తి చేస్తారు. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ కలిసి ఎంపిక చేస్తాయి. ముందు చేసిన ఖర్చులకు డబ్బు రాదు, ఒక్కో అంశానికి ఒక్కసారే సబ్సిడీ ఇస్తారు. మధ్యలో ఆపేస్తే లేదా తప్పుడు పత్రాలు ఇస్తే సబ్సిడీ రద్దయి, ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి తీసుకుంటారు.

Also Read: గాంధీ భవన్‌లో నేతల వరుస భేటీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారానికి మెర్జ్ ఫార్ములా!

Tags

Related News

గాంధీ భవన్‌లో నేతల వరుస భేటీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారానికి మెర్జ్ ఫార్ములా!

హైదరాబాద్‌లో గంజాయి కలకలం.. 29.810 కిలోలు సీజ్‌.. లాడ్జి మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్

జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల్లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రమాదమా? కుట్రా?

సదాశివపేటలో ఏసీబీ మెరుపు దాడి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు

ఇన్నాళ్లూ సైలెంట్.. ఇక సిట్ సైరన్ మోగించనుందా? ఫోన్ ట్యాపింగ్‌లో బిగ్ అప్‌డేట్!

‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!

ఒక్క స్కాన్‌తో మీ భూమి మ్యాప్ అంతా మీ ఫోన్‌లోనే.. కొత్త పాస్‌బుక్‌ల ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×