BigTV English

CM Revanth Condolence to Lasya Family: ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల సీఎం రేవంత్, ప్రముఖుల సంతాపం!

CM Revanth Condolence to Lasya Family: ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల సీఎం రేవంత్, ప్రముఖుల సంతాపం!
cm revanth reddy news today

CM Revanth Condolence on Lasya Nanditha Death: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. పటాన్ చెరు ORRపై ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత దుర్మరణం చెందారు. లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న పెద్ద కూతురు. తండ్రి అడుగు జాడల్లోనే 2015లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఊహకందని రీతిలో లాస్య నందిని మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పోస్ట్ చేశారు.

 

Read More: 3 నెలల్లో మూడుసార్లు వెంటాడిన మృత్యువు.. అచ్చిరాని ఫిబ్రవరి

అలానే ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

యువనేతను రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విషాదం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. వారం రోజుల క్రితమే లాస్య నందినిని కలిశానని ఆమె ఫోటోని కూడా పంచుకున్నారు.

ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య .. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు వాపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన సంతాపం ప్రకటించారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×