BigTV English

CM Revanth Reddy Meeting: 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు!

CM Revanth Reddy Meeting: 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు!
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy Chevella Parliament Constituency: తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జనజాతర పేరుతో నిర్వహించే ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. తుక్కుగూడ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది.


మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బలాబలాలపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మాల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ లో చేవెళ్ల నియోజకవర్గ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండంగా తీసుకోవాలన్నారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం సేకరించామని తెలిపారు.


Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్, నావల్ల కావడం లేదంటున్న ఆ నేత !

సర్వేల ఆధారంగానే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×