Kamal Haasan is not a Villain in Prabhas Kalki 2898 AD: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. లోక నాయకుడు కమల్ హాసన్.. విలన్ గా నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కి నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్కి లో భైరవగా ప్రభాస్ కనిపించనున్నాడు. కమల్- ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ అంచనాలను తారుమారు చేసేలా ఉన్నాయి కమల్ మాటలు.
Also Read: Vijay Devarakonda: వారితో కలిసి విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు.. దానికోసమేనా.. ?
తాజాగా కమల్ హాసన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడాడు. ” కల్కి సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను. అందులో నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. అంతే.. కల్కి మీద కొత్తకొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. అదేంటి.. కమల్ విలన్ అన్నారు కదా.. ఈయన ఏంటి గెస్ట్ రోల్ అంటున్నారు. అసలు కథలో మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్- కమల్ నే కదా.. కానీ, ఇప్పుడు కమల్ విలన్ కాదు అంటే కల్కికి విలన్ ఎవరు.. ? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం.. కల్కి ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో కమల్ కనిపిస్తాడు. దీనికి కంటిన్యూ గా సెకండ్ పార్ట్ ఉంటుంది. కమల్ కేవలం పార్ట్ 1 గురించే చెప్పి ఉంటాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా నాగ్ అశ్విన్ .. అసలు ఈ సినిమాను ఎలా చూపిస్తాడో అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అన్నమాట మాత్రం వాస్తవం. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.