E-Paper
Advertisement

Telangana Congress : ప్రజా భవన్‌గా ప్రగతి భవన్.. పాలనా భవన్‌గా సచివాలయం..

Telangana Congress : ప్రజా భవన్‌గా ప్రగతి భవన్.. పాలనా భవన్‌గా సచివాలయం..
TS Politics

Telangana Congress news(TS politics):

సీఎంగా ఉన్నప్పుడు.. అయితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్‌హౌస్‌లో మాత్రమే ఉన్నారనే అపవాదును కేసీఆర్‌ మూటగట్టుకున్నారు. ప్రగతి భవన్‌లో ఆయన ఉన్నా.. అందరికీ అక్కడ ఎంట్రీ ఉండేది కాదు. బాస్ అనుమతి ఉంటేనే ఎవరైనా ప్రగతి భవన్‌లోకి అడుగుపెట్టేవారు. ఇక సీఎం హోదాలో కేసీఆర్‌ సెక్రటేరియట్‌కి వెళ్లారో లేదో కూడా ఎవరికీ గుర్తు లేదు. కొత్త సచివాలయం కట్టాక కొన్నిసార్లు అక్కడ సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. నేతలతో పాటు సామాన్యులెవర్నీ అందులోకి అడుగుపెట్టనివ్వలేదు. రేవంత్‌రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా… అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేవారు. ఇక సామాన్యుల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

ఎన్నికల్లో గెలిస్తే… ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని కాంగ్రెస్‌ భరోసానిచ్చింది. కేసీఆర్‌లా తాము వ్యవహరించబోమని, ప్రజాపాలన సాగిస్తామని రేవంత్‌రెడ్డి ముందు నుంచీ చెబుతున్నారు. సెక్రటేరియట్‌ను ప్రజా సమస్యలు తీర్చే పాలనా భవన్‌గా మారుస్తామన్నారు. ఇక ప్రగతిభవన్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా మార్చి.. సీఎం హోదాలో తాను సామాన్యులను నేరుగా కలుస్తానని కూడా చెప్పారు. దాంతో కాంగ్రెస్‌ పాలన ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఉన్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×