E-Paper
Advertisement

డిజిటల్ రేస్‌లో తెలంగాణ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

డిజిటల్ రేస్‌లో తెలంగాణ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!
Advertisement

Digital Transformation: స్వేచ్ఛ బ్యూరో: డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా… ప్రభుత్వ పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నోవాటెల్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతోందని, సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కు అనుగుణంగా మార్పుల్ని అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు… మనం సాధిస్తున్న పరివర్తనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందన్నారు.

గ్రోత్ ఇంజన్ లా తెలంగాణ

Advertisement

ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో భారత్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ ఒక గ్రోత్ ఇంజన్ లా మారిందన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ నడిపించే ఒక బలమైన ఎకోసిస్టంను ఇప్పటి నుంచే అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో మన వాటాను10 శాతానికి చేర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. ఒకప్పుడు కేవలం సంప్రదాయ బుక్ కీపింగ్, అకౌంట్స్ ఆడిటింగ్‌కే పరిమితమైన సీఏలు.. నేడు కార్పొరేట్ సంస్థలకు ‘స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్స్’గా రూపాంతరం చెందారన్నారు.

ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు

ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు… అదే స్థాయిలో సైబర్ మోసాలు, డీప్‌ఫేక్స్, సైబర్ అరెస్ట్, క్రిప్టో ఫ్రాడ్స్ తదితర సవాళ్లు కూడా తెరపైకి వచ్చాయన్నారు. ఇలాంటి తరుణంలో సీఏలు కేవలం ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుండా… ‘సైబర్ అష్యూరెన్స్’కూ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందన్నారు. మారుతున్న ట్రెండ్స్ కు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రముఖులు

కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్ – ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్థన్, ఆర్బీఐ సీజీఎం శైలజా రాణి జంపాల, ఎన్ ఎస్ ఈ సీఐఎస్వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్.. లీకేజీలపై భట్టి తీవ్ర ఆగ్రహం!

Related News

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కూతురు మాట్లాడితే నాపై చర్యలా? ముందు సీఎంపై చర్య తీసుకోవాలి-కొండా సురేఖ

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

Big Stories

Advertisement
×