E-Paper
Advertisement

TG EAPCET 2026: తెలంగాణలో ఎప్సెట్ షెడ్యూల్ రిలీజ్.. ఈసారి అమ్మాయిలకు గుడ్ న్యూస్..?

TG EAPCET 2026: తెలంగాణలో ఎప్సెట్ షెడ్యూల్ రిలీజ్.. ఈసారి అమ్మాయిలకు గుడ్ న్యూస్..?
Advertisement

 TG EAPCET 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్-2026 పరీక్షా కేంద్రాల్లో అమ్మాయిలకు ఇబ్బంది లేకుండా కీలక నిర్ణయం తీసుకున్నామని, అమ్మాయిలకు హైదరాబాద్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, టీజీ ఈఏపీ సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలకి వారి ఇంటికి దగ్గరగా ఉండే హైదరాబాద్లోని కేంద్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్లను కేటాయిస్తామని తెలిపారు.

శివారు ప్రాంతాల్లో పరీక్ష..

జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్ టియు విసి కిషన్ కుమార్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, జేఎన్టియుహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు, ఎప్ సెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసిన అనంతరం అమ్మాయిలు ఇంటికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని భావించిన ఎప్ సెట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే ఈ ఏడాది నుంచి మొబైల్ నుంచే ఎప్ సెట్ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసేలా యాప్ను రూపొందించినట్టు వెల్లడించారు.

Advertisement

Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – వృత్తి వ్యాపారాల్లో పురోగతి

రూ.10 వేల అపరాధ రుసుము..

ఎప్ సెట్ దరఖాస్తులను గురువారం నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ మేరకు విద్యార్థులు పొందే మార్కులు విద్యార్ధి కంప్యూటర్లో కనిపిస్తాయని తెలిపారు. ఆ మార్కులకనుగుణంగా అతనికి ఎప్ సెట్లో ఏ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందనేది గత రెండు సంవత్సరాల మార్కులు, ర్యాంకుల ఆధారంగా సరాసరి చేసి అప్డేట్ చేసినట్టు తెలిపారు. ఫైనల్ కీ, నార్మలైజేషన్ అనంతరం మార్కులను ప్రకటిస్తామని తెలిపారు. రూ.10 వేల అపరాధ రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 4 నుంచి 11 తేదీల్లో ఎప్సెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

సిలబస్‌లో మార్పు..

Advertisement

ఈఏపీసెట్ కు సంబంధించిన సిలబస్ ను 2028 లో మార్పు చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో సిలబస్ ను, 2027-28 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్లోలో మార్పులు చేస్తుండటంతో దీనికనుగుణంగానే 2028లో నిర్వహించే ఎప్ సెట్లో మొత్తం మారిన ఇంటర్ సిలబస్తో పరీక్షను నిర్వహించనున్నట్టు కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఏడాది పరిపాలన, చేపట్టిన సంస్కరణలు, పురోగతిపై వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

Also Read: Kalvakuntla Kavitha: మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. ప్రభుత్వం పై కవిత ఫైర్!

Related News

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Big Stories

Advertisement
×