E-Paper
Advertisement

Telangana Election Results: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఫలితాలు ప్రకటన ఇలా..

Telangana Election Results: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఫలితాలు ప్రకటన ఇలా..
Advertisement

Telangana Election Results: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. అలాగే ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. సూక్ష్మ పరిశీలకుడు, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. ఈ ముగ్గురితో పాటు కంట్రోల్ యూనిట్లను టేబుల్ పైకి తీసుకొచ్చేందుకు ఒక క్యారీమెన్ సేవలందిస్తారు. రౌండ్ల వారిగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కౌంటింగ్ అసిస్టెంట్ నమోదు చేస్తారు. టేబుల్స్ పై ఉన్న కంట్రోల్ యూనిట్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయితే దానిని ఒక రౌండ్ గా భావిస్తారు.

ఓట్ల లెక్కింపులో ఉన్న కంట్రోల్ యూనిట్ల బ్యాటరీలు పనిచేయకపోయినా, మొరాయించినా వాటిని పక్కన ఉంచి.. మిగతా కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో మొరాయించిన వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కించిన తర్వాత గెలిచిన పార్టీ, అభ్యర్థిని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్థారిస్తారు. రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి ధృవపత్రం అందజేస్తారు.

Advertisement

ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించనున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసులలో ఉన్నవారు, దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో కలిపి.. మొత్తం 2.20 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 2290 మంది ఉండగా.. వీరిలో 221మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్, మిగతావారు పురుష అభ్యర్థులు ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×