E-Paper
Advertisement

TS Election News: 15న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం.. మేనిఫెస్టో ప్రకటన

TS Election News: 15న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం.. మేనిఫెస్టో ప్రకటన
BRS Party Latest News

BRS Party Latest News(TS Political News):

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న పోలింగ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఈ నెల 15న పార్టీ అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో ఈ సమావేశంలో.. అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందించనున్నారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్‌ ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్‌ శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో, 18న జడ్చర్ల, మేడ్చల్‌లో జరిగే సభలకు కేసీఆర్‌ హాజరుకానున్నారు.

న‌వంబ‌ర్ 9న సీఎం కేసీఆర్‌ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు. గ‌జ్వేల్, కామారెడ్డి.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నామినేష‌న్లు స‌మ‌ర్పించ‌నున్నారు. నామినేష‌న్ల దాఖ‌లు సందర్భంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆనవాయితీ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేయనున్నారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×