E-Paper
Advertisement

Telangana Elections 2023 : నామినేషన్ వేసిన 82 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే షాకవుతారు

Telangana Elections 2023 : నామినేషన్ వేసిన 82 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే షాకవుతారు
Advertisement

Telangana Elections 2023 : ఎన్నికలంటేనే ఒకరి మీద కోపంతో మరొకరి నామినేషన్లు వేస్తూనే ఉంటారు. కొందరు పార్టీ అభ్యర్థిగా, మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులోనే భాగంగా తన పెద్ద కొడుకు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో 82 ఏళ్ల బామ్మ చివరకు నామినేషన్ వేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 82 ఏళ్ల వయసు ఉన్న బామ్మ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన శ్యామల స్వాతంత్య్ర సమరయోధుడు మురళీధర్ రావు భార్య. ప్రస్తుతం ఆమె జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కొడుకుతో వచ్చిన విబేధాల కారణంగా తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని శ్యామల వివరించారు. పెద్ద కొడుకు రామారావు కోర్టును ఆశ్రయించడంతో ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే వృద్ధాప్యానికి చేరుకున్న తానిప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కనీసం తన బాగోగులు కూడా పెద్ద కొడుకు చూసుకోవడం లేదని శ్యామల ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని దేశంలోని ప్రముఖలందరికీ వినతి పత్రాలు పంపించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

82 ఏళ్ల వయసుకు వచ్చిన తనపట్ల చూపుతున్న వివక్ష సరికాదని తన గోడు సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే జగిత్యాలలో నామినేషన్ వేశానన్నారు. తన పెద్ద కొడుకు వల్ల జరిగిన అన్యాయాన్ని సవరించి తన ఇంటిని తనకు ఇప్పించాలని కూడా కోరుతున్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×