E-Paper
Advertisement

Telangana Elections 2023 : కేసీఆర్ VS షబ్బీర్ అలీ.. నిజామాబాద్ లో పెరిగిన పొలిటికల్ హీట్

Telangana Elections 2023 : కేసీఆర్ VS షబ్బీర్ అలీ.. నిజామాబాద్ లో పెరిగిన పొలిటికల్ హీట్
Advertisement

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న పోలింగ్ జరగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో ఫోకస్‌ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఉండనుంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ బరిలో దిగనుండటంతో ఇప్పటికే ఎన్నికల వేడి మరింత హీటెక్కింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లకే టికెట్‌ కేటాయించింది. కేసీఆర్‌పై మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గట్టి పోటీ ఇవ్వనున్నారు. 6 గ్యారంటీ స్కీంలతో హస్తం ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా.. బీజేపీ నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఆసక్తిగా మారింది. ఆ పార్టీ నేత వెంకటరమణణారెడ్డి బరిలో దిగుతారన్న ప్రచారం సాగుతోంది. ఇక స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాసుల బాలరాజు బరిలో ఉన్నప్పటికీ.. ప్రచారంలో, అభివృద్ధిలోనూ పోచారం ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక బాల్కొండ ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా పోచారం బాటలోనే ప్రచారం తో పాటు అభివృద్ధిలోనూ ముందంజలో ఉన్నారు. వేములకు పోటీగా కాంగ్రెస్ నుంచి సునీల్‌రెడ్డి జిల్లా అధ్యక్షులు మనాల మోహన్‌రెడ్డి, రైతు నాయకుడు అన్వేష్‌రెడ్డిలు పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఇంకా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే రాష్ట్రంలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అయిన షకీల్‌కు మరోసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కన్ఫర్మ్‌ చేసింది. అయితే.. కాంగ్రెస్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పోటీపై సందిగ్ధం నెలకొంది. ఇక బీజేపీ నుంచి మేడపాటి ప్రకాష్‌, వడ్డీ మోహన్‌రెడ్డిలు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నా.. పార్టీ ఎవరికి టికెట్‌ కేటాయిస్తున్నది వేచి చూడాలి. ఈ నెల 16న బీజేపీ, వచ్చేవారం కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×